India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో NDA నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా, గడ్కరీ, చంద్రబాబు, నితీశ్ కుమార్, పవన్ సహా పలువురు NDA పక్ష నేతలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి NDA భేటీ ఇది. ఈ సమావేశంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని ప్రమాణస్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
AP: కర్నూలు జిల్లా డోన్‌లో TDP నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి జయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను ఆయన ఆరు వేల ఓట్ల తేడాతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు అయిన సూర్యప్రకాశ్ గతంలో 3సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రి గానూ పని చేశారు. రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించిన ఈ సీనియర్ లీడర్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. వైద్యపరీక్షల కోసం వారం రోజుల బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేయగా జడ్జి తోసిపుచ్చారు. ఆయనకు ఈనెల 19 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్.. ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చారు. ఇటీవలే మళ్లీ జైలులో లొంగిపోయారు.
ఏపీ లోక్‌సభ బరిలో తొమ్మిది మంది నారీమణులు నిలిస్తే ముగ్గురు విజయ ఢంకా మోగించారు. రాజమండ్రిలో పురందీశ్వరి(BJP), నంద్యాలలో బైరెడ్డి శబరి(TDP), అరకు- తనూజారాణి(YCP) గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి YS షర్మిల కడపలో, ఏలూరులో లావణ్య ఓడిపోయారు. విశాఖ- బొత్స ఝాన్సీ(YCP), నరసాపురం- గూడూరి ఉమాబాల(YCP), హిందూపురం- శాంత(YCP) ఇంటిబాట పట్టారు. అరకులో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పరాజయం పాలయ్యారు.
AP: ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం విజయం వెనుక పవన్ కళ్యాణ్ 17 ఏళ్ల కృషి దాగి ఉందని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విజేతలతో ఆయన మాట్లాడారు. ‘పవన్ నాయకత్వంలో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాం. అంతే బాధ్యతగా వారి కోసం పనిచేయాలి. ప్రజల సమస్యలు తీరుస్తూ వారికి అండగా నిలబడాలి. జనసైనికులు, వీరమహిళల పోరాటం అద్భుతం’ అని కొనియాడారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. మీ కృషి, పట్టుదల ఏపీ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. అఖండ విజయం అందుకున్న బాలకృష్ణ బాబాయ్‌కి, నారా లోకేశ్, శ్రీభరత్, పురందీశ్వరి అత్తకి, జనసేనాని పవన్‌కి నా శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాల్లో గెలిచిన BJP ఇప్పుడు 240 స్థానాలకు పడిపోయింది. దీనికి కేవలం 0.7 శాతం ఓట్లే కారణం. 2019లో 37.30 శాతం ఓట్లు సాధించిన BJP.. తాజా ఎన్నికల్లో 36.60 శాతం ఓట్లు సాధించింది. ఈ చిన్న మార్జిన్ ఏకంగా 63 సీట్లను దూరం చేసి.. NDAను 350 మార్క్ దాటకుండా చేసింది. కాంగ్రెస్ 2019లో 19.5% ఓట్లతో 52 స్థానాలు సాధించగా.. ఇప్పుడు 21.2% ఓట్లతో 99 స్థానాలు దక్కించుకుంది.
భారత రాజకీయాలను మార్చగల శక్తి చంద్రబాబు చేతిలో ఉందన్నారు తమిళనాడు మైనార్టీ కమిషన్ ఛైర్మన్ పీటర్ ఆల్ఫోన్స్. ‘ఆయన మోదీకే సపోర్ట్ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే నాదొక సూచన. కుమారుడు లోకేశ్‌ని AP CMగా చేసి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, కేంద్ర హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాలి. PM నార్త్ ఇండియా అయినప్పుడు, డిప్యూటీ PM సౌత్‌ఇండియా వారు ఉండాలి. అప్పుడే ఇక్కడే హక్కులు కాపాడబడతాయి’ అన్నారు.
AP:రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న చంద్రబాబు, పవన్‌లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి’ అని Xలో పేర్కొన్నారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో 21 MLA సీట్లు సాధించిన తమ పార్టీ.. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఏపీ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు. జనసేన గోరంత దీపం.. కొండంత వెలుగునిచ్చిందని చెప్పారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని.. ఇది రాజకీయాల్లో కొత్త మార్పునకు నాందికావాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.