India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటమి తర్వాత ‘హౌ ఈజ్ ద జోష్ అంటే హై సర్’ అనే అంటానని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. అమేథీలో కేఎల్ శర్మ ఆమెపై 1.6 లక్షల ఓట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ‘జీవితమంటే ఇంతే. పదేళ్లలో గ్రామగ్రామాన తిరిగాను. రోడ్లు, కాలువలు, బైపాస్‌లు, మెడికల్ కాలేజీలు, ఇళ్లు కట్టించాను. ఏదేమైనా గెలుపు, ఓటముల్లో నాకు అండగా ఉన్న అందరికీ రుణపడి ఉంటాను. వేడుకలు చేసుకుంటున్న వారికి అభినందనలు’ అని ఆమె అన్నారు.
ఒడిశాలో తొలిసారిగా అధికారం చేపట్టనున్న BJP నుంచి పలువురు అభ్యర్థుల పేర్లు CM రేసులో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ జువల్ ఓరమ్, పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజయంత్ పాండా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం గమనార్హం. దీంతో అధిష్ఠానం ఎవరికి అధికారం కట్టబెడుతుందో త్వరలోనే స్పష్టత రానుంది.
ప్రధాని మోదీ 400 సీట్లు గెలుచుకోవాలనుకున్న కోరిక నెరవేరలేదు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఇది సాధ్యమైంది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఆ పార్టీ 48.12శాతం ఓట్లు పొందింది. సీపీఐ 22 సీట్లు సాధించి 5.71శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. 7.4శాతం ఓట్లతో బీజేపీకి 2 సీట్లు వచ్చాయి.
చంద్రబాబు, నితీశ్ కుమార్ తక్షణమే NDAని వీడి INDIA కూటిమిలో చేరాలని కేంద్ర
మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కోరారు. ‘భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వీరు నిర్ణయం తీసుకోవాలి. దేశ భవిష్యత్తును మోదీ నాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను బయపెట్టేందుకు ED, CBI, IT ఏజెన్సీలను వాడుకున్నారు. దేవుడి బిడ్డగా పిలుచుకునే ఈ వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు’ అని Xలో పోస్ట్ చేశారు.
AP: EVMలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ MLA <<13377622>>రవీంద్రనాథ్<<>> రెడ్డి ఆరోపించారు. ‘సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ట్యాంపరింగ్ చేశారు. బార్‌కోడ్‌ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయల్దేరారు. మోదీ నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశంలో వీరిద్దరు పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. మరోవైపు అమరావతిలో జరిగే తన ప్రమాణస్వీకారానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
AP: శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు NDA కూటమిలో జోష్ నింపింది. ఉమ్మడి సిక్కోలులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు, ఒక MP స్థానంలోనూ కూటమి అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైన TDP ఈసారి కూటమిగా క్లీన్ స్వీప్ చేసింది. ఫలితాలతో TDP, BJP,జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న TDP రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీసం మెలేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో నీలిరంగు చీమలను సైంటిస్టులు కనుగొన్నారు. బెంగళూరుకు చెందిన ‘అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్’కు చెందిన కీటక శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. వీటికి ‘పరాపరాత్రెచీనా’ అని నామకరణం చేశారు. ఈ చీమల కాళ్లు మినహా శరీరం మొత్తం నీలిగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న16,724 చీమ జాతుల్లో ఈ నీలి చీమలు చాలా అరుదైనవి.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు 25ఏళ్లకే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరీ సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి LJP అభ్యర్థిగా గెలుపొందగా, మరొకరు రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజనా జాతవ్, ఎస్పీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ కౌశంబి పార్లమెంట్ స్థానంలో గెలుపొందారు. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా గెలుపొందారు.
తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ‘సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది. దీనిపై విచారణ జరపాలి’ అని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.