India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోమారు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. ఖవాజా, మెక్‌స్వీనీ, స్మిత్, మార్ష్, హెడ్ వికెట్లను బుమ్రా దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లందరూ తేలిపోయిన చోట బుమ్రా ఒక్కరే వికెట్లతో చెలరేగడం గమనార్హం. 87 ఓవర్ మార్కు దాటే సరికి ఆస్ట్రేలియా స్కోరు 327/6గా ఉంది.

దేశాభివృద్ధి విషయంలో నెహ్రూ మోడల్ విఫలమైందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ‘నెహ్రూ అభివృద్ధి మోడల్ నుంచి నెహ్రూ విదేశాంగ విధానం పుట్టుకొచ్చింది. దాన్ని ఇప్పుడిప్పుడే సంస్కరిస్తున్నాం. రష్యా, చైనా సైతం అప్పటి తమ భావజాలాల్ని నేడు వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం నేటికీ కొన్ని వర్గాలు వాటిని కొనసాగిస్తున్నాయి. 2014 తర్వాతి నుంచి అన్నీ సరిచేస్తున్నాం’ అని వివరించారు.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లనున్నారు. చిరు ఫ్యామిలీతో కలిసి ఆయన లంచ్ చేస్తారని తెలుస్తోంది. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ అరవింద్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.

అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో తరఫున ఉచిత అత్యవసర వైద్య సేవల కేంద్రం ప్రారంభించినట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలిపారు. ‘జాలి, దయలోనే నిజమైన సనాతన ధర్మం ఉంటుందని మా తాత ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలే స్ఫూర్తిగా ఉచితంగా అత్యవసర వైద్య సేవల్ని రామమందిరం వద్ద అందిస్తున్నాం. ఇప్పటికే శ్రీశైలం, తిరుమల, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వద్ద ఇవి ఉన్నాయి. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేశారు.

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం లేదని సమాచారం. లోక్‌సభ బిజినెస్ ఖాతాలో ఈ బిల్లులు లేకపోవడం దీనిని బలపరుస్తోంది. కాగా రేపు లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం ప్రకటించింది. కానీ రివైజ్డ్ లోక్‌సభ బిజినెస్ ఖాతాలో ఈ బిల్లులు కనిపించలేదు.

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు రాగా ప్రతి 500కు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు 30-35 ప్రశ్నలు అడిగి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5,00,000 ఇవ్వనుంది.

కొందరు రోజూ కూల్ డ్రింక్స్ తాగడాన్ని ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ అలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రింక్స్‌లో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్, ఇతర రసాయనాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. ఎముకల్లో డీకాల్సిఫికేషన్ పెరిగి బలహీనపడతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోయి క్రమంగా బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎనామిల్ నాశనమై దంతక్షయం ప్రమాదం పెరుగుతుంది.

నటి తాప్సీ పెళ్లి ఆమె బాయ్‌ఫ్రెండ్ మథియాస్‌తో ఈ ఏడాది మార్చి 23న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అంతకు కొన్ని నెలల ముందుగానే తమ అధికారిక వివాహం పూర్తైనట్లు తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘జనానికి ఈ విషయం తెలియదు. గత ఏడాది డిసెంబరులోనే మేం అధికారికంగా పెళ్లి చేసుకున్నాం. త్వరలోనే వివాహ వార్షికోత్సవం కూడా వస్తోంది. ఉదయ్‌పూర్‌లో వేడుక చేసుకున్నామంతే’ అని పేర్కొన్నారు.

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ సినిమాల్లో హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ దండు, చైతూ కాంబినేషన్‌లో ఓ మూవీ.. అఖిల్, మురళీ కిశోర్ కాంబోలో మరో చిత్రం తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్తాయని టాక్. కాగా ఇటీవల విడుదలైన ‘పుష్ప2’ మూవీలో శ్రీలీల ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే.

భారత్ అంటే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ మూడో టెస్టులోనూ తన జోరు కొనసాగించారు. గత మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన ఆయన, గబ్బా మ్యాచ్‌లోనూ సెంచరీ చేశారు. క్రీజులోకి వచ్చిన తర్వాత హెడ్ దాదాపు ప్రతి ఓవర్లోనూ ఓ ఫోర్ బాదడం గమనార్హం. భారత బౌలర్లు ఎంత కష్టపడినా హెడ్ వికెట్ తీయలేకపోతున్నారు. గతంలోనూ టెస్టు ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయాన్ని హెడ్ అడ్డుకున్నారు.
Sorry, no posts matched your criteria.