News December 15, 2024

ఇంటి నిర్మాణానికి రూ.5,00,000.. UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు రాగా ప్రతి 500కు ఒకరిని ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్తున్న అధికారులు 30-35 ప్రశ్నలు అడిగి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. పథకం కింద ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5,00,000 ఇవ్వనుంది.

Similar News

News January 26, 2025

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా: బాలకృష్ణ

image

తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు. NTR వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను. నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News January 26, 2025

అజిత్‌కు ‘పద్మ భూషణ్’; కరెక్టా? కౌంటరా?

image

కోలీవుడ్ హీరో అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై తమిళనాట డివైడ్ డిస్కషన్ అవుతోంది. ఇది తగిన గౌరవమని తల ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇందులో BJP రాజకీయం ఉందని విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో MGR, కమల్ పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేషన్, రజినీకాంత్‌లకు ఇలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో పార్టీ ప్రకటించాక అజిత్‌కు అవార్డుతో కౌంటర్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.

News January 26, 2025

మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.