India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ RKS బధౌరియా బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ మోదీ లీడర్‌షిప్‌లో గడిచిన ఎనిమిదేళ్లు నా సర్వీస్‌లో ఉత్తమం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు సాయుధ బలగాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి’ అని బధౌరియా అన్నారు.
హోలీ పండుగ సందర్భంగా అయోధ్య బాలరాముడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి హోలీ పండుగ కావడంతో వివిధ రకాల పూలు, ఆభరణాలతో అలంకరించిన రాముడి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర సోషల్ మీడియాలో పంచుకుంది.
TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో SIB డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసి కూపీ లాగగా.. ఏస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్లు బయటికొచ్చాయి. తాజాగా వారినీ రిమాండ్‌కు తరలించారు. ఇంత జరుగుతున్నా.. అధికార, విపక్షాలు మౌనంగా ఉండటం గమనార్హం. అయితే సైలెంట్‌గా దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయలను’ బయటికి లాగాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.
TG: కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని మాజీ మంత్రి KTR ధ్వజమెత్తారు. ‘తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో అబద్ధాలను చూపిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా నన్ను, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో జరుగుతోంది. ఇప్పటికైనా ఆయా సంస్థలు తమ తీరు మార్చుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నా’ అని X లో పోస్ట్ చేశారు.
TG: జగిత్యాలలో టెన్త్ అమ్మాయిల గంజాయి <<12910567>>కేసులో <<>>సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ అమ్మాయికి గంజాయి ఇచ్చి ఏడాదిగా పలుమార్లు రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ్, వెంకటేశ్, నితిన్ అనే ముగ్గురు నిందితులను గుర్తించి, పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు పెంచాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. BCCI ఇస్తున్న ఫీజులకు సమానంగా తాము కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్స్ట్ సీజన్ నుంచి ఆ జట్టు ప్లేయర్లు డబుల్ అమౌంట్ అందుకోనున్నారు. ప్రస్తుతం మ్యాచుల అనుభవాన్ని బట్టి ప్లేయర్లకు రోజుకు ₹20K-₹60K వరకు BCCI చెల్లిస్తోంది. ఇప్పుడు MCA ఇచ్చే మొత్తంతో కలిపి ప్లేయర్లకు రోజుకు ₹40వేల నుంచి ₹1.20లక్షల వరకు వస్తాయి.
AP: కాపుల కోసం పనిచేయడంతో రాజకీయంగా నష్టపోయినట్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం బాధించిందన్నారు. వారిద్దరి ఓటమి కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో చేరకపోయి ఉంటే పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవాడినన్నారు. ఆ నియోజకవర్గంలో పవన్ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.
హీరో మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా టీవీల్లోకి రాబోతోంది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ ఉగాది పర్వదినం సందర్భంగా బుల్లితెరపైకి రానుంది. ఏప్రిల్ 9న జెమినీ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే అవకాశముంది. ఈ మేరకు జెమినీ ఓ ప్రోమోను విడుదల చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
TG: మెదక్‌లో బీఆర్ఎస్‌కు అభ్యర్థిగా స్థానికులు దొరకడం లేదా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. ‘కరీంనగర్ నుంచి హరీశ్ రావును తీసుకొచ్చి మెదక్‌లో రుద్దారు. హరీశ్ రావు చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. తనది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ప్రజలను దోచుకున్నారు. ఆ డబ్బును ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారు’ అని రఘునందన్ ఆరోపించారు.
ఓటర్ కార్డు లేకపోయినా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు వీలుగా ఈసీ నోటిఫై చేసింది. అవి.. ఆధార్, ఉపాధి హామీ కార్డు, బ్యాంక్/ పోస్టాఫీస్ అకౌంట్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, NPR కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు.
Sorry, no posts matched your criteria.