India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు? తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే’ అని పేర్కొన్నారు.

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామని సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లేఖను షేర్ చేసింది. ‘4వ తేదీన రాత్రి 9.30 గంటలకు అల్లుఅర్జున్, హీరోయిన్, వీఐపీలు వస్తున్నారు. భారీగా ప్రజలు తరలివస్తారు. కాబట్టి పోలీసులు బందోబస్తు కల్పించండి’ అని చిక్కడపల్లి ఏసీపీకి లేఖను రాశారు.

TG: సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదవగా, ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ను పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై జట్టు SMAT ఫైనల్‌కు దూసుకెళ్లింది. బరోడాతో జరిగిన సెమీ ఫైనల్-1లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 159 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అజింక్యా రహానే (98) త్రుటిలో శతకం చేజార్చుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (46) రాణించారు. మరికాసేపట్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య సెమీ ఫైనల్-2 జరగనుంది.

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో సీఎం మీడియాకు తెలిపారు.

వరకట్నం, గృహహింస చట్టాల సంస్కరణ, దుర్వినియోగం సమీక్షకు కమిటీని కోరుతూ సుప్రీంకోర్టులో PIL దాఖలైంది. చట్టాలను సమీక్షించే కమిటీలోకి సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు, లాయర్లు, లీగల్ జూరిస్టులను తీసుకోవాలని పిల్ వేసిన అడ్వకేట్ విశాల్ తివారీ కోరారు. పెళ్లి జరిగేటప్పుడు, రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఆభరణాలు, బహుమానాలపై మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. భార్యాబాధితుడు అతుల్ సూసైడ్ నేపథ్యంలో ఈ PIL దాఖలవ్వడం గమనార్హం.

అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్‌రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని ట్వీట్ చేశారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్‌ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత అల్లు అర్జున్‌కు మద్దతుగా అంబటి వరుస ట్వీట్లు చేశారు. ఆయనను ఎవరూ అణగదొక్కలేరని ట్వీట్లు పెట్టారు.

అల్లు అర్జున్ విషయంలో నాంపల్లి ట్రయల్ కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తనపై కేసులు క్వాష్ చేయాలన్న బన్నీ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ సాయంత్రం గం.4కు వాయిదా వేసింది. అయితే ఈలోపే పోలీసులు ఆయన్ను ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. దీంతో ఈ న్యాయమూర్తి హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తారా? లేక రిమాండ్ విధిస్తారా? మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి.

కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్శన్‌తోపాటు పవిత్రా గౌడ సహా ఈ కేసులో ప్రధాన నిందితులైన మరో ఐదుగురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. డిసెంబర్ 9న దర్శన్ బెయిల్ పిటిషన్‌పై తుది వాదన విన్న జస్టిస్ విశ్వజిత్ శెట్టి తాజాగా తీర్పు వెలువరించారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జూన్ 11న పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.