India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియా కూటమి అనూహ్య రీతిలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండడం వెనుక అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను ఈ ఎన్నికల్లో అజెండాగా ఎత్తుకొని ప్రయోజనం పొందడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఇక ఈ ఎన్నికల్లో 2014, 2019లో మాదిరి బీజేపీ ఒక బలమైన నెరేటివ్‌ని సెట్ చేయలేకపోవడం కూడా ఇండియా కూటమికి లాభించింది.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 9,758 ఓట్ల ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
బీజేపీ నేత మేనకా గాంధీ ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో వెనుకంజలో కొనసాగుతున్నారు. ఆమెపై ప్రత్యర్థి రామ్ భుయాల్ నిషాద్(సమాజ్‌వాదీ) 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన మేనకా.. గత ఎన్నికల్లో సుల్తాన్‌పూర్ నుంచి 14వేల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు టీఎంసీ నేత మహువా మొయిత్రా బెంగాల్ కృష్ణానగర్ నుంచి 7వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.
AP: పిఠాపురంలో జనసేన అధినేత భారీ మెజార్టీలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న జనసేనాని.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 5వ రౌండ్ ముగిసే సరికి 40+వేలకు పైగా మెజార్టీతో ఉన్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పవన్ మెజార్టీ 50 వేలకు పైగా ఉంటుందని జనసైనికులు అంచనా వేస్తున్నారు.
యూపీ, మోదీ, యోగి.. మొన్నటి వరకు ఈ కాంబినేషన్‌కు ఎదురులేదు. అలాంటిది ఈ ఎన్నికల్లో ఈ ద్వయానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 80లో అత్యధిక సీట్లు గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే ఇప్పుడేమో సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే ఇక్కడ 37 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి 42 చోట్ల గెలిచేలా కనిపిస్తోంది. దాంతో మోదీ, యోగీ జోడీ మ్యాజిక్ పనిచేయలేదని అర్థమవుతోంది. ఎస్పీ అనూహ్యంగా పుంజుకోవడమే ఇందుకు కారణం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమికి 161 సీట్లొస్తాయని KK సర్వే అంచనా వేయడంతో అంతా షాక్ అయ్యారు. అసలు ఈ సర్వే ఎక్కడిదని, దీనిని నమ్మలేమంటూ వైసీపీ నాయకులు విమర్శలకు దిగారు. కానీ, ఆ సర్వే ఫలితాలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం వైసీపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కూటమి 153 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ఆయన గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది. SC నియోజకవర్గాలైన వరంగల్‌లో ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, నాగర్ కర్నూల్‌లో మల్లు రవి, పెద్దపల్లిలో వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు. ఇక ST నియోజకవర్గాల విషయానికి వస్తే మహబూబాబాద్ స్థానంలో బలరామ్ నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క ఆదిలాబాద్‌లో మాత్రం BJP అభ్యర్థి నగేశ్(ST) ముందంజలో కొనసాగుతున్నారు.
టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్‌పై 55వేలకు పైగా మెజారిటీతో శ్రీనివాస్ విజయదుందుభి మోగించారు. అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 50వేలకు పైగా మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు.
తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్రలు చేస్తూ, సభలు పెడుతూ నిర్విరామంగా శ్రమించిన రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓటమి దిశగా సాగుతున్నారు. కోయంబత్తూరు నుంచి ఆయన పోటీలో ఉండగా.. డీఎంకే నేత గణపతి రాజ్ కుమార్ లీడ్‌లో ఉన్నారు. అయితే, ఓ పోలింగ్ బూత్‌లో ఆయనకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. అన్నామలై ఉన్నత చదువులు చదివి, ఐపీఎస్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.
రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌లో 1.4 లక్షల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రాయ్‌బరేలీలోనూ ప్రత్యర్థుల కంటే ముందంజలో దూసుకెళ్తున్నారు. 2019తో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 52 సీట్లు మాత్రమే సాధించిన ఆ పార్టీ, ఈసారి 98+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Sorry, no posts matched your criteria.