News December 5, 2024

పుష్ప-2 ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్: ఆర్జీవీ

image

పుష్ప-2 విజయం సాధించిందని చెబుతూ డైరెక్టర్ ఆర్జీవీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్, మూవీ టీమ్‌కు కంగ్రాట్స్. అల్లు ఇప్పుడు మెగా మెగా మెగా మెగా’ అని రాసుకొచ్చారు. ‘మెగా’ కంటే అల్లు ఎన్నో రెట్లు ఎక్కువని ఇటీవల ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. టికెట్ ధరల పెంపునూ సమర్థించారు.

Similar News

News January 26, 2025

పద్మకు ఎంపికైన వారికి CM అభినందనలు

image

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి CM రేవంత్ అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ సహా ఈ పురస్కారాలకు <<15260048>>తెలుగువారు <<>>ఎంపిక కావడంపై CM హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగాల్లో చేసిన కృషి, అంకితభావమే వారికి ఈ పురస్కారాలు దక్కేలా చేసిందని కొనియాడారు.

News January 26, 2025

విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం

image

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.

News January 25, 2025

‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం

image

కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.