News June 4, 2024

వెనుకంజలో మంత్రి ఆదిమూలపు సురేశ్

image

AP: కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఆదిమూలపు సురేశ్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి డీబీవీ స్వామి 699 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కనిగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ 662 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెనుకంజలో ఉన్నారు. గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి 692 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

మంత్రి విడదల రజనీ వెనుకంజ.. తాడికొండ, గురజాలలో భారీ మెజార్టీ దిశగా టీడీపీ

image

AP: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీ వెనుకంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి 5745 ఓట్ల ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ 19వేల ఓట్లు, అమరావతి ప్రాంతమైన తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 18,272 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 6,969 ఓట్ల ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింది!

image

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింద‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 2019 ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌ను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితుల్లో భారీ మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డి 25 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 11, ఇత‌రులు 3 స్థానాల్లో త‌మ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు భిన్నంగా ఎర్లీ ట్రెండ్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

News June 4, 2024

బెంగాల్‌లో ఆధిక్యంలోకి టీఎంసీ

image

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ లీడింగ్‌లో కొనసాగుతోంది. 42 స్థానాల్లో TMC 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ కూటమి 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలు, బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

News June 4, 2024

ఏపీకి మంచి రోజులు: అంబటి రాయుడు

image

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.

News June 4, 2024

సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆధిక్యం

image

AP: సర్వేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి 1029 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు వెనకంజలో ఉన్నారు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ 7940 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

153 స్థానాల్లో కూటమి ఆధిక్యం

image

AP: 175 అసెంబ్లీ స్థానాల్లో 153 స్థానాల్లో NDA కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ 128, జనసేన 19, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వైసీపీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అటు రాయలసీమలో బద్వేల్, పులివెందుల, పత్తికొండ, ఆలూరు, గుంతకల్లు, జమ్మలమడుగు సహా కొన్ని చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

అనంతపురంలో ఆధిక్యాలు ఇలా

image

* కళ్యాణదుర్గం-సురేంద్రబాబు(టీడీపీ)-11,072
* అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్(టీడీపీ)- 5,026
* హిందూపురం- బాలకృష్ణ(టీడీపీ)-7,860
* ధర్మవరం-కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(వైసీపీ)- 4,678
* పుట్టపర్తి-పల్లె సింధూరరెడ్డి(టీడీపీ)-1,008

News June 4, 2024

మల్కాజిగిరిలో కాషాయ రెపరెపలు

image

మల్కాజిగిరిలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లక్షా 40వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ రోడ్‌షో ఈటలకు కలిసివస్తోంది.

News June 4, 2024

అబ్ కీ బార్ 400 పార్ న‌హీ

image

‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తించిన బీజేపీని ఎర్లీట్రెండ్స్ టెన్ష‌న్ పెడుతున్నాయి. ఎన్డీయే – ఇండియా కూట‌ముల మ‌ధ్య హోరాహోరీ పోరు క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 289, ఇండియా కూట‌మి 223 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. అయితే, ఎన్డీయే ఆధిక్యంలో ఉన్న 100కు పైగా స్థానాల్లో కేవ‌లం 5 వేల మెజారిటీయే ఉండ‌డం గ‌మ‌నార్హం.