India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 90వేల ఓట్ల ఆధిక్యంలో రఘువీర్‌రెడ్డి ఉన్నారు. ఇటు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 26వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రెండూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు.
హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల ఎర్లీ ట్రెండ్స్‌లో జాట్ సామాజిక వర్గం ఇండియా కూటమి వెనుక ర్యాలీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. లైంగిక వేధింపులపై మహిళా రెజ్లర్ల ఉద్యమం, అగ్నివీర్‌పై యువతలో వ్యతిరేకత, జాట్ల మద్దతు అధికంగా ఉండే జేజేపీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడం లాంటి కారణాలు బీజేపీకి జాట్లను దూరం చేసినట్టు ఎర్లీ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఒడిశా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం 147 స్థానాలుండగా బీజేపీ 47 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికార బీజేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 6, సీపీఐ(ఎం) 1, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ముందంజలో ఉన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్‌లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నేత భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లురాగా, షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.
ఎన్నికల ఫలితాల కోసం Way2Newsను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం గం.8:45 నిమిషంలో ఏకంగా 15 లక్షల కాంకరెంట్ యూజర్లు యాప్‌లో లైవ్‌గా ఉన్నారు. ఇక కేవలం 8:30 నుంచి 9గంటల మధ్య 3 మిలియన్లకు పైగా యూజర్లు యాప్‌లో ఎన్నికల అప్‌డేట్స్ పొందారు. ఏ యాప్‌లో ఇవ్వనట్లుగా వేగమైన అప్‌డేట్స్, లైవ్ గ్రాఫిక్ డిజైన్స్, ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలనూ అందిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
TG: నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. BRS మూడో స్థానంలో ఉంది.
AP: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెనుకంజలో ఉన్నారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఆధిక్యంలో ఉన్నారు. సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
కేరళలో 20 స్థానాలకు గాను 18 స్థానాల్లో UDF ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో LDF లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ 14, కాంగ్రెస్ 12, జేడీఎస్ 2 చోట్ల ముందంజలో ఉన్నాయి. గోవాలో 2 స్థానాలకు గాను బీజేపీ 1, INC 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది.
గుజరాత్‌లో బీజేపీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో 15 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ 11 స్థానాల్లో, జేడీఎస్ 2 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో బీజేపీ 15, కాంగ్రెస్ 8, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.