News December 4, 2024

‘పుష్ప-2’: స్టార్లు ఏ థియేటర్లో చూస్తున్నారంటే?

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీపై అభిమానులతో పాటు సెలబ్రిటీల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా పలువురు సెలబ్రిటీలు థియేటర్లలో వీక్షించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
* సంధ్య(RTC X ROAD)- కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్
* నల్లగండ్ల అపర్ణ- దర్శకుడు రాజమౌళి
* AMB- పుష్ప-2 నిర్మాతలు
* శ్రీరాములు(మూసాపేట)-దిల్ రాజు, అనిల్ రావిపూడి, ఇతర ప్రముఖులు

Similar News

News January 22, 2026

PV సింధు అరుదైన ఘనత

image

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.

News January 22, 2026

IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IIFCL <<>>ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ (ఫైనాన్స్/MBA/PGDM/ఎననామిక్స్, టూరిజం మేనేజ్‌మెంట్, ESG మేనేజ్‌మెంట్), BE/BTech/B.Arch, CA/CFA/CWA, LLB, LLM, MTech, M.Planing ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iifclprojects.in

News January 22, 2026

అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఇద్దరు హీరోలు?

image

వరుస హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి మూవీ రిలీజయ్యే అవకాశముందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ, రానా గతంలో ‘రానా నాయుడు’ సిరీస్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.