India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని YCP అధినేత జగన్ అన్నారు. పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ‘సూపర్ 6 అమలుపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు. ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.

WTC పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా తొలి స్థానంలో కొనసాగుతోంది. SA రెండో స్థానానికి ఎగబాకగా, AUS మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా SL, NZ, ENG, PAK, BAN, WI ఉన్నాయి. IND, SA, AUSలో ఏవైనా రెండు జట్లు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. BGT సిరీస్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది. WIపై BAN గెలవడం, స్లో ఓవర్ రేట్ కారణంగా NZ, ENGకు పాయింట్లలో ICC కోత విధించడంతో ర్యాంకింగ్స్ మారాయి.

AP సీఎం చంద్రబాబు రేపు ముంబై వెళ్లనున్నారు. ఆజాద్ మైదానంలో జరిగే మహారాష్ట్ర సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముంబై రావాలని NDA నేతల నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పర్యటన ఖరారైంది.

TG: BRS కార్యాలయాలకు భూకేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తక్కువ ధరకు భూముల అమ్మకాలు జరిగాయని, రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.5కోట్లకు కేటాయించారని పిటిషనర్ కోర్టులో వాదించారు. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని BRS అధ్యక్షుడు KCR సహా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు పంపింది.

సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సహా దేశంలోని పలు రీజియన్లలో 723 డిఫెన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్స్‌మెన్-389, ఫైర్‌మెన్-247, మెటీరియల్ అసిస్టెంట్-19, జూ.ఆఫీస్ అసిస్టెంట్-27 సహా మరిన్ని పోస్టులున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా పాసైన 18-27 ఏళ్లలోపు వారు అర్హులు. DEC 22 దరఖాస్తుకు చివరి తేదీ. వివరాలకు <

మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

AP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు, వైసీపీ బలోపేతం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఆందోళనలు చేపట్టడం సహా పలు అంశాలపై జగన్ చర్చిస్తున్నారు.

TG: గతంలో CMగా ఎవరున్నా, నంబర్ 2 మాత్రం రోశయ్యదేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYD హైటెక్స్‌లో రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ‘సమయం వచ్చినప్పుడు ఆయనే నం.1 అయ్యారు. రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం ఏర్పడింది. ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వ్యక్తికి HYDలో విగ్రహం లేకపోవడం బాధాకరం. మేం ఏర్పాటు చేస్తాం’ అని CM చెప్పారు.

‘సీజ్ ద షిప్’ డ్రామా బెడిసికొట్టిందని YCP ఎద్దేవా చేసింది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్, నాదెండ్ల ద్వయం రాద్ధాంతం చేశారంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకర్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి జరుగుతోందని, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్‌లోకి బియ్యం లోడింగ్ చేశారని తెలిపింది. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే అని ఆరోపించింది. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ ఎందుకు తనిఖీ చేయలేదు? అని ‘X’లో ప్రశ్నించింది.

భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘పుష్ప-2’ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప-2’ టీమ్‌కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.
Sorry, no posts matched your criteria.