News June 4, 2024

ఈసారి అత్య‌ధిక మెజారిటీ ఎవ‌రికి?

image

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈసారి భారీ మెజారిటీ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న దానిపై ఆసక్తి నెల‌కొంది. 2019 ఎన్నిక‌ల్లో గుజరాత్‌లోని న‌వ్సారీ నుంచి బీజేపీ అభ్య‌ర్థి సీఆర్ పాటిల్ 6.89 ల‌క్ష‌ల మెజారిటీతో, 2014లో వార‌ణాసి నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 5.70 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 ఉపఎన్నికలో క‌డ‌ప నుంచి వైఎస్ జ‌గ‌న్ 5.45 ల‌క్ష‌ల‌ మెజారిటీతో గెలిచారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లోభారీ మెజారిటీ ఎవ‌రిదో!

News June 4, 2024

కడప‌లో వైసీపీకి బిగ్ షాక్

image

AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనకబడ్డారు. పులివెందులలో సీఎం జగన్ లీడింగులో ఉన్నారు. అటు కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుకబడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లు వెనకబడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే.

News June 4, 2024

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

image

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

విజయవాడలో కేశినేని నాని వెనుకంజ

image

విజయవాడ లోక్‌సభ సీటులో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, సోదరుడు కేశినేని నాని(వైసీపీ) వెనుకంజలో ఉన్నారు. తిరువూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ లీడ్‌లో ఉన్నారు.

News June 4, 2024

బాలకృష్ణ లీడింగ్.. బుగ్గన వెనుకంజ

image

AP: హిందూపురం అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి దీపిక బరిలో ఉన్నారు. అయితే హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌లో వైసీపీ అభ్యర్థి శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు. అలాగే డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెనకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ బరిలో ఉన్నారు.

News June 4, 2024

అనకాపల్లిలో సీఎం రమేశ్ ముందంజ

image

AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్‌లో సీఎం రమేశ్‌కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.

News June 4, 2024

MP: 17 స్థానాల్లో బీజేపీ దూకుడు.. శివరాజ్, సింధియా ముందంజ

image

మధ్య‌ప్రదేశ్‌లో వార్ వన్‌సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్‌నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్‌లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.

News June 4, 2024

గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన లీడ్

image

ఉమ్మడి ప.గో. జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాకినాడ రూరల్‌లో జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు ఉండి, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, దెందులూరులో టీడీపీ అభ్యర్థులు రఘురామకృష్ణరాజు, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ లీడ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ఒంగోలులో దామచర్ల ఆధిక్యం

image

AP: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

19,935ఓట్ల లీడింగ్‌లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్‌లో 19,935 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.