News December 4, 2024
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.17 గంటలకు 117 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 80,962 వద్ద, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,492 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలపై మదుపర్లు దృష్టి పెట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.68గా ఉంది.
Similar News
News January 19, 2025
డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి
AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
News January 19, 2025
రేషన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేయాలి: హరీశ్ రావు
TG: ప్రజాపాలన దరఖాస్తులకూ రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన BRS విజయమని హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం పేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితి, భూ పరిమితి పెంచుతూ నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ను ఉపాధి హామీ స్కీమ్‌కు లింక్ చేయొద్దన్నారు.
News January 19, 2025
గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.