India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్నానం చేయడాన్ని బద్ధకంగా ఫీలయ్యే వారికి జపాన్ ఓ కొత్త ఆవిష్కరణ తెచ్చింది. ఆ దేశానికి చెందిన సైన్స్ కో సంస్థ ‘హ్యామన్ వాషింగ్ మెషీన్’ రూపొందించింది. AIతో పనిచేసే ఈ మెషీన్‌లోని కుర్చీలో కూర్చుంటే 15నిమిషాల్లో స్నానం చేయిస్తుంది. మనిషి శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి స్నానం చేయించడంతో పాటు ఆరబెడుతుంది. వచ్చే ఏడాది మెషీన్‌ను ప్రదర్శనకు ఉంచి, ఆపై అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ వేళ ‘పుష్ప-3’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూడో భాగంలో మెయిన్ విలన్‌గా VD ఉంటారని, ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ గురించి ఆయన 2022లోనే హింట్ ఇచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. కాగా, రేపు ‘పుష్ప-2’ విడుదల కానుంది.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ‘గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల వెంట ఫాల్ట్ లైన్ ఉంటుంది. GSI ప్రకారం ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉంది. ఏప్రిల్ 13,1969న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ లైన్ కారణంగా 5.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది’ అని తెలిపారు.

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు ఆన్‌లైన్‌లో భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. రాష్ట్రంలో 1.16లక్షల బీటెక్ సీట్లుండగా, 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. వీరిలో అర్హులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. 30% యాజమాన్య కోటాలో మెరిట్, NRI పేరిట కాలేజీలు అధిక వసూళ్లు చేస్తున్నాయనే ఆరోపణలతో విద్యామండలి చర్యలకు ఉపక్రమించింది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, కాళ్లు వైబ్రేట్ అవ్వడం గమనించామని WAY2NEWS <<14784831>>యూజర్లు<<>> చెప్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో 17వ అంతస్తులోనూ వైబ్రేషన్స్ గుర్తించామన్నారు. మరికొందరైతే చచ్చిపోతామేమో అనుకున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. SHARE IT

AP: 2025లో సెలవులకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ క్యాలెండర్ ప్రకటించారు. రానున్న ఏడాదిలో మొత్తం 26 సాధారణ, 13 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 17వరకు సంక్రాంతి సెలవులు, మే 11 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా హాలిడేస్ ప్రకటించారు. హైకోర్టు, జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు, లేబర్ కోర్టులకు ఈ సెలవులు వర్తిస్తాయి.

TG: రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న స్కిల్ యూనివర్సిటీకి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి పేరును ప్రతిపాదిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యువజన విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో నిన్న జరిగిన ‘తెలంగాణ యూత్ డే’ సదస్సుకు ఆయన హాజరయ్యారు. శ్రీకాంతా చారి వర్ధంతి రోజును ‘తెలంగాణ యూత్ డే’గా ప్రకటించాలని వచ్చిన విజ్ఞప్తులను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రైళ్లలో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచ్‌లలో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ చర్యలతో రైలులో అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వివరించింది.

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన యాప్‌ను సీఎం రేవంత్ రేపు లాంచ్ చేయనున్నారు. యాప్ లాంచ్ అయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. ఈ యాప్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించింది. దరఖాస్తుదారుల ఇళ్లకు ప్రభుత్వ సిబ్బంది వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీని ద్వారా వివరాలు సేకరించగా, ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.

శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన ‘అమరన్’ సినిమా రేపటి నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.300కోట్లకు పైగా కలెక్షన్స్‌తో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ సినిమా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
Sorry, no posts matched your criteria.