News December 3, 2024

PV సింధుకు కాబోయే భర్త గురించి తెలుసా?

image

PV సింధుకు కాబోయే <<14775039>>భర్త<<>> వెంకట దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మాజీ IRS ఆఫీసర్ అయిన ఈయన తండ్రి GT వెంకటేశ్వరరావు MDగా వ్యవహరిస్తున్నారు. సాయి డిప్లొమా, ఫ్లేమ్ వర్సిటీలో BBA చదివారు. IIITలో డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్‌ పూర్తి చేశారు. JSW గ్రూపులో కన్సల్టెంట్‌గా పని చేశారు. IPLలో DCతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం. దత్తసాయి ఆస్తి సుమారు రూ.50కోట్లు ఉంటుందని అంచనా.

News December 3, 2024

సైనిక పాల‌న ఎత్తివేత‌కు తీర్మానం

image

ద‌క్షిణ కొరియాలో సైనిక పాల‌న ఎత్తివేత‌కు నేష‌న‌ల్ అసెంబ్లీ తీర్మానించింది. 300 మంది స‌భ్యులున్న అసెంబ్లీలో 190 మంది ఈ ఓటింగ్‌కు హాజరయ్యారు. ఓటింగ్‌లో పాల్గొన్న ప్ర‌తిఒక్క‌రూ మూకుమ్మ‌డిగా సైనిక పాల‌న‌కు వ్య‌తిరేకంగా తీర్మానించారు. మరోవైపు అధ్యక్షడు యూన్ ప్రకటనకు వ్య‌తిరేకంగా పెద్దఎత్తున ప్ర‌జ‌లు అసెంబ్లీ వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు. బ‌ల‌గాలు వారిని ఎక్క‌డికక్కడ నిలువ‌రించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

News December 3, 2024

హలో.. నేను మీ ముఖ్యమంత్రి చంద్రబాబు..

image

ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై ప్రజాస్పందనను సీఎం చంద్రబాబు నేరుగా తెలుసుకోనున్నారు. ఇందుకోసం చంద్రబాబు వాయిస్‌తో లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. IVRS విధానంలో కొనసాగే ఈ కాల్‌లో తాము పొందుతున్న పథకం, దానిపై స్పందనను నమోదు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో పథకాలు అమలు చేసినా ప్రజల అభిప్రాయం తెలుసుకోకపోవడంతో ఫలితం బెడిసికొట్టడంతో తమ విషయంలో అలా జరగొద్దని బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

News December 3, 2024

సినిమాలకు గుడ్ బై.. హీరో యూటర్న్!

image

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారనే ప్రచారంపై బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే స్పందించారు. <<14766262>>తన పోస్ట్‌పై<<>> తప్పుగా ప్రచారం జరిగిందని తెలిపారు. తాను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను రోటిన్‌గా ఫీలవుతున్నానని, ఇంకాస్త బెటర్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా 12TH FAIL సినిమాతో విక్రాంత్ అందరి దృష్టిని ఆకర్షించారు.

News December 3, 2024

ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. గ్రామస్థాయిలో భూవివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భూఆక్రమణలు, 22ఏ, ఫ్రీహోల్డ్‌పై ఫిర్యాదులు స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

News December 3, 2024

పుష్ప-2కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

image

పుష్ప-2ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తీశారని శ్రీశైలం అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతించిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదించారు. ఊహాజనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు జరిమానా విధిస్తామని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

News December 3, 2024

రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్‌కు సన్మానం

image

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సన్మానం జరగనుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్‌తో పాటు ఆమిర్‌ను సత్కరించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు ట్విటర్‌లో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14 వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు ఆండ్రూ గార్ఫీల్డ్, ఈవా లాంగోరియా, బాలీవుడ్ నుంచి కరీనా కపూర్, రణ్‌బీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

News December 3, 2024

RECORD: 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్

image

కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్నవయస్కురాలిగా కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లుర్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల సమైరా ఏడాదిన్న‌ర‌లో 6 ప‌రీక్ష‌లు క్లియ‌ర్ చేసి 200 గంట‌ల ఫ్లయింగ్ అవ‌ర్ అనుభ‌వాన్ని పొందారు. 25 ఏళ్లకే పైల‌ట్ లైసెన్స్ పొందిన కెప్టెన్ తాపేశ్ కుమార్ త‌న స్ఫూర్తి అన్నారు. త‌ల్లిదండ్రులు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని లైసెన్స్ పొందిన సంద‌ర్భంగా స‌మైరా హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

News December 3, 2024

EXCLUSIVE: ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.

News December 3, 2024

మెగాస్టార్ న్యూ లుక్ అదిరిపోయిందిగా

image

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని షేర్ చేస్తూ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన నటించిన ‘విశ్వంభర’ ఫిబ్రవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తర్వాతి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నారు.