News December 3, 2024

ఈ నెలాఖరుకు లక్ష గృహ ప్రవేశాలు: అజయ్ జైన్

image

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన గృహ సముదాయాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు కొత్త ఇళ్లను నిర్మించేందుకు కూటమి సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 7.5 లక్షల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు. మరో 8 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు లక్ష మందితో సామూహిక గృహ ప్రవేశాలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు.

News December 3, 2024

బంగ్లాలో కాషాయ వస్త్రాలు ధరించొద్దు: ఇస్కాన్ ప్రతినిధి

image

బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ గురువులు, హిందువులు కాషాయ వస్త్రాలు ధరించొద్దని, బొట్టు పెట్టుకోవద్దని కోల్‌కతా ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆలయాలు, ఇళ్ల వరకే మత విశ్వాసాలను పరిమితం చేయాలన్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే దుస్తులు కనిపించకుండా మెడ భాగాన్ని, బొట్టు కనబడకుండా తలను కవర్ చేసుకోవాలని సూచించారు. బంగ్లాలో హిందువులపై దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.

News December 3, 2024

వేల ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాలివే!

image

దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలున్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. * రాజస్థాన్‌ అల్వార్ జిల్లాలోని పాండుపోల్ హనుమాన్ టెంపుల్‌కు 5000 ఏళ్ల చరిత్ర ఉంది. * UPలోని బృందావన్‌లో 3500 ఏళ్ల చరిత్ర కలిగిన లుటేరియా హనుమాన్ మందిర్. * యూపీలోని ఝాన్సీలో గ్వాలియర్ రోడ్ సమీపంలో ఉన్న సఖీ కే హనుమాన్ టెంపుల్. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

News December 3, 2024

టీడీపీలోకి YCP మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని?

image

AP: వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారని వార్తలు వచ్చినా, చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

News December 3, 2024

బియ్యం బదులు నగదు.. కేంద్రం నిర్ణయం?

image

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందే సగానికిపైగా బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తునట్లు తెలుస్తోంది.

News December 3, 2024

సచిన్ రికార్డుకు చేరువలో జైస్వాల్

image

భారత ప్లేయర్ జైస్వాల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1,280 రన్స్ చేసిన అతను మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తారు. 2010లో సచిన్ చేసిన 1,562 పరుగులు IND తరఫున అత్యధికం. ఈ నెలలో మరో 3 టెస్టులు ఆడే అవకాశం ఉన్నందున జైస్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సుంది. ఓవరాల్‌గా మహ్మద్ యూసఫ్(PAK) 1,788 పరుగులతో టాప్‌లో ఉన్నారు.

News December 3, 2024

గంటకు 76 ఓట్లు పడటం అనూహ్యమేమీ కాదు: MH ఎన్నికల అధికారి

image

మహారాష్ట్రలో ఓటింగ్ శాతం అసాధారణంగా పెరగలేదని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి చొక్కలింగం అన్నారు. సాయంత్రం 5-6 గంటల మధ్య 76 లక్షల మంది ఓట్లేశారన్న వార్తలపై స్పందించారు. ‘MHలో లక్ష పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంటే ఆ గంటలో ఒక్కో స్టేషన్లో సగటున 76 మంది ఓటేశారు. ఆ రోజు మొత్తం ఓటింగ్ సరళి గమనిస్తే గంటకు 60-70 మందే ఓటేశారు. ఇది మామూలే. 2019 డేటాతో గ్రాఫ్‌పై పోలిస్తే పెద్ద గ్రోతేమీ ఉండదు’ అని తెలిపారు.

News December 3, 2024

డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించనుంది. భూ వివాదాలకు పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10శాతం థర్డ్ పార్టీ ద్వారా పరిశీలిస్తామని అనగాని తెలిపారు. అటు గ్రామ సభల్లో ప్రజల ఫిర్యాదులపై రసీదులు ఇస్తామన్నారు.

News December 3, 2024

ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ది సేమ్ ప్రాబ్లమా?

image

టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ సేమ్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. వంశాల గోల లేకుండా తమ సొంతంగా ఒక వ్యవస్థను సృష్టించుకుంటున్నారు. కానీ ఇదే వీరిపై కొందరిలో నెగటివ్ కలిగిస్తోంది. దీంతో వీరి సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తుంటారు. సినిమా ఫంక్షన్లలో బాలకృష్ణ పేరును ఎన్టీఆర్.. చిరంజీవి, పవన్ పేరును బన్నీ ప్రస్తావించకపోవడంతో నెగటివిటీ పెరిగిపోతున్నట్లు టాక్.

News December 3, 2024

1967 తర్వాత మళ్లీ HYDలో ‘సంతోష్ ట్రోఫీ’

image

నేషనల్ సీనియర్ ఫుట్‌బాల్ ఛాంఫియన్‌షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. చివరిగా 1967లో HYD ఆతిథ్యం ఇవ్వగా, 57 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశమొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 14- 31 వరకు క్వార్టర్స్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించనున్నట్లు భారత ఫుట్‌బాల్ సమాఖ్య తెలిపింది. ఫైనల్ రౌండ్ టోర్నీలో 12జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77సార్లు జరిగింది.