India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. డిప్యూటీ CM పవన్ <<14745624>>కాకినాడ<<>> పర్యటనతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. DGPతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలింపులో ఎవరున్నారనేదాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలని చూస్తోంది.

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ కులగణనను వ్యతిరేకిస్తున్న కొందరు BRS నేతలు ఇందులో పాల్గొనబోమని ముందే చెప్పేశారు. ప్రభుత్వం మాత్రం గ్రామాలు, పట్టణాల్లో సర్వే దాదాపు పూర్తి చేసినట్లు చెబుతోంది. సొంతూరు వదిలి వేరే ఊరికి వలస వెళ్లిన వాళ్లు ఎక్కడివారు అక్కడే కులగణనలో పాల్గొన్నారు. ఇంతకీ మీరు ఇందులో పాల్గొన్నారా? కామెంట్ చేయండి.

TG: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పైగా ఈ విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనపై T BJP ఛార్జ్‌షీట్ విడుదల చేసింది.

తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ను HYD జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సస్టెయిన్ కార్ట్ సంస్థను స్థాపించి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడులు పెట్టించి మోసగించాడు. శిల్పారెడ్డి అనే మహిళ మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. అతడు సుమారు రూ.100 కోట్లకుపైగా దోచుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు సమంత, కీర్తి సురేశ్, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్పారెడ్డి సహా పలువురు ఇతడి బాధితులే.

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో మొదలు పెడతారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్‌ను మేకర్స్ రివీల్ చేయగా ఆకట్టుకుంది.

ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమని Radiological Society of North America అధ్యయనంలో తేలింది. నికోటిన్ రహితంగా భావించే వేప్ లిక్విడ్‌లో నికోటిన్‌తో పాటు ప్రొపిలీన్ గ్లైకాల్స్, గ్లిసరిన్, ఫ్లేవరింగ్, రసాయనాలు ఉంటాయని American Lung Association తెలిపింది. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, ఊపిరితిత్తులు శరీరంలోకి ఆక్సిజన్ తీసుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తేల్చాయి.

ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. దేవర సినిమా కంటే అదనంగా పెంపు ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి 23 వరకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం <<14751051>>అనుమతిచ్చిన<<>> విషయం తెలిసిందే. ఈ ధరలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలకు కుక్క కరిస్తే రేబిస్ వ్యాక్సిన్ సహా చిన్నవయసులో వేయించే ఇతరత్రా వ్యాక్సిన్‌లను పిరుదులపై వేయించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పిరుదులపై వ్యాక్సిన్ వేయించడం వల్ల పిల్లల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు. ఏ టీకానైనా సరే వయసు ఆధారంగా తొడలో లేదా భుజంపై వేయించాలని, అప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని పీడియాట్రిక్ వైద్యురాలు శివరంజని సంతోష్ తెలిపారు.

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీల, స్టార్ పేసర్‌ల కుమారులకూ ఫ్యాన్స్ ఆర్మీలు పుట్టుకొస్తున్నాయి. హిట్ మ్యాన్ కొడుకు అహాన్, కోహ్లీ కుమారుడు అకాయ్, అంగద్ బుమ్రాలు టీమ్ఇండియాకు ఆడతారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్ వరల్డ్ కప్‌లలో అకాయ్, అహాన్‌లు ఓపెనర్స్‌గా, అంగద్ బౌలర్‌గా ఆడతారంటున్నారు. దీంతో అప్పుడే నిర్ణయించేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

దివంగత అక్కినేని నాగేశ్వరరావు లీడ్ యాక్టర్‌గా నటించిన తొలి సినిమా ‘శ్రీ సీతారామ జననం’ విడుదలై నేటికి 80 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘80 వసంతాల శ్రీ సీతారామ జననం. అత్యంత పిన్న వయస్కుడైన తొలి కథానాయకుడు. మొదటి చిత్రంతోనే శ్రీరాముడి పాత్ర ధరించారు. ఈ చిత్రంలో పద్యాలు సొంతగా పాడుకున్నారు’ అని పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.