News December 1, 2024

హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలు ఏంటి?: కిషన్‌రెడ్డి

image

TG: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పైగా ఈ విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనపై T BJP ఛార్జ్‌షీట్ విడుదల చేసింది.

Similar News

News February 19, 2025

VIRAL: అమ్మాయిల ఇన్‌స్టా స్టోరీ పోస్ట్

image

ఓ యువతీయువకుడు సంతోషంగా కలిసున్నప్పుడు, తర్వాత ఆ యువతి తీవ్రంగా గాయపడ్డ ఫొటోల పోస్ట్ ఒకటి ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి ‘డియర్ గర్ల్స్. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి కానీ ముఖం, డబ్బు చూసి కాదు’ అని క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోయిన అమ్మాయి చివరికి ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చే ఈ పోస్ట్‌ను చాలామంది అమ్మాయిలు స్టోరీగా పెట్టుకున్నారు.

News February 19, 2025

CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

image

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.

News February 19, 2025

GOOD NEWS.. ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు

image

AP: BC, EWS కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో 1.25 లక్షల BC, 45వేల EWS దరఖాస్తులు రాగా నిన్నటి నుంచి ఎంపిక ప్రారంభించారు. FEB 25లోగా లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదిస్తారు. MAR 8-12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. MAR 17 నుంచి 20 మధ్య లబ్ధిదారులకు చేరుతుంది.

error: Content is protected !!