News December 1, 2024

టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

image

AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.

News December 1, 2024

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

image

TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్లు సమాచారం.

News December 1, 2024

రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.

News December 1, 2024

గ్యాస్ సిలిండర్ ధర పెంపు

image

ప్రతినెలా మొదటి రోజున ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.16.5 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం HYDలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉన్నాయి.

News December 1, 2024

పాపం సాయితేజ.. స్నేహితుడి డ్యూటీ చేస్తూ..

image

అమెరికాలో ఖమ్మంకు చెందిన <<14748888>>సాయితేజ<<>> (26) అనే విద్యార్థిని దుండుగులు హత్య చేయడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చికాగోలో ఎంబీఏ చదువుతున్న అతడు ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. డ్యూటీ ముగిసినా స్నేహితుడు నమాజ్‌కు వెళ్తానని చెప్పడంతో సాయితేజ అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలోనే దుండగులు డబ్బులు ఇవ్వాలని తుపాకులతో బెదిరించారు. డబ్బులిచ్చినా చంపేసి వెళ్లిపోయారు.

News December 1, 2024

తిరుమలలో రూం దొరకాలంటే..

image

AP: తిరుమలకు వెళ్తే గదులు దొరక్క చాలా మంది ఇబ్బంది పడతారు. తిరుమల కొండపై ఉన్న7,500 గదుల్లో 50% ఆన్‌లైన్‌లో ఉంటాయి. మిగతా 50% రూంలను తిరుమలలోని CRO ఆఫీసుకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఉ.5 గంటల నుంచి దర్శన టికెట్లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఇస్తే 1-4 గంటల్లో గది కేటాయిస్తారు. రూ.50, రూ.100, రూ.1000 గదులు ఉంటాయి. మ.12 గంటల తర్వాత వెళ్తే రూంలు దొరికే అవకాశం చాలా తక్కువ.
SHARE IT

News December 1, 2024

BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు

image

US డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు BRICS దేశాలు ఓ <<14438627>>కొత్త కరెన్సీని<<>> తీసుకొస్తున్నాయి. దీనిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త కరెన్సీని సృష్టిస్తే 100 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్యానికి గుడ్‌బై చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ స్థానాన్ని BRICS భర్తీ చేసే అవకాశం లేదన్నారు.

News December 1, 2024

రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే?

image

ప్రభుత్వాలు కేజీ రేషన్ బియ్యానికి రూ.43 ఖర్చు పెడుతున్నాయి. సబ్సిడీ కింద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి. క్వాలిటీగా ఉండవనే భావనతో 70-80% మంది వాటిని తినకుండా KG రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. అక్రమార్కులు వీటిని ప్రాసెస్ చేసి KG రూ.80-100 వరకు విదేశాలకు ఎగుమతి చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వాలు బియ్యం బదులు నేరుగా సబ్సిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తే ఈ దందాను ఆపే అవకాశం ఉంది. మీరేమంటారు?

News December 1, 2024

‘పుష్ప-2’: ఒక్క టికెట్ రూ.1,200.. కరెక్టేనా?

image

‘పుష్ప-2’ ప్రీమియర్ టికెట్ ధరలను రూ.800 పెంచడంతో మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ.1,200, సింగిల్ స్క్రీన్లో రూ.1,000 అవుతోంది. ఒక్క షోకు ఇంత రేటా? అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అభిమానులు మాత్రమే ప్రీమియర్స్ చూస్తారని, వాళ్లు యాక్సెప్ట్ చేయడం వల్లే ధరలు పెంచుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్రాంతికి సైతం టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?

News December 1, 2024

పంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్?

image

TG: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను గతంలోలాగా సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. రెండు టర్మ్‌ల రిజర్వేషన్ విధానాన్ని, సర్పంచ్‌పై కలెక్టర్‌ వేటు వేసే అధికారాన్ని తొలగించనున్నట్లు సమాచారం.