News November 30, 2024

2వ స్థానంలోకి SA.. పడిపోయిన AUS

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్స్ టేబుల్ మారింది. శ్రీలంకపై తొలి టెస్టు గెలిచిన సౌతాఫ్రికా 59.26 PCT పాయింట్లతో టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది. అటు టీమ్ ఇండియా 61.11 PCT పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా BGT ఫస్ట్ టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా(57.69) 3వ స్థానానికి పడిపోయింది. 4లో న్యూజిలాండ్(54.55), 5లో శ్రీలంక(50) ఉన్నాయి.

News November 30, 2024

US కేసుపై తొలిసారి స్పందించిన అదానీ

image

సౌర విద్యుత్ కాంట్రాక్టుకు సంబంధించి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు తనపై నమోదైన కేసుపై వ్యాపారవేత్త గౌతం అదానీ తొలిసారి స్పందించారు. ఇటీవల అమెరికా నుంచి తాము ఆరోపణలు ఎదుర్కొన్నామని, అయితే అలాంటి సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదని ఆయన అన్నారు. తమపై జరిగే ప్రతి దాడి తమను మరింత బలపరుస్తుందని ఆయన జైపూర్‌లో నిర్వహించిన 51వ జెమ్ అండ్ జువెల్లరీ అవార్డ్స్ కార్యక్రమంలో అన్నారు.

News November 30, 2024

BREAKING: ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు

image

TG: మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2002 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్న వారే అర్హులంది. సరైన అర్హతలు లేకపోవడంతో 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. వీరిని 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం మళ్లీ తీసుకోగా, దీన్ని సవాల్ చేస్తూ జారీ చేసిన GOపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ GOను కోర్టు రద్దు చేసింది.

News November 30, 2024

ఏ నిర్ణయమైనా ఓకే కానీ గౌరవం కావాలి: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం విషయంలో తాము ఏ నిర్ణయానికైనా సుముఖంగానే ఉన్నామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ తెలిపారు. ‘సమస్యను పరిష్కరించాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే ఐసీసీ తీసుకునే నిర్ణయాలు మమ్మల్ని గౌరవించేలా ఉండాలి. సమానత్వం పాటించాలి. మా ప్రతిష్ఠకు భంగం వాటిల్లకూడదు’ అని పేర్కొన్నారు. టోర్నీని హైబ్రీడ్ విధానంలో నిర్వహించేందుకు పాక్ అంగీకరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

News November 30, 2024

సంపన్నులే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారు: రంగనాథ్

image

TG: హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపన్నులే ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాల్లో పేదల కంటే ఎక్కువగా ధనికులే ఉన్నారని ఆయన వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల లీడర్లు అందులో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రభుత్వ సహకారం ఉందని తెలిపారు.

News November 30, 2024

OTTలోకి థ్రిల్లర్ మూవీ

image

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బౌగెన్‌విల్లా’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి సోనీ లివ్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. భార్యభర్తలు కారులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భార్య గతం మర్చిపోతుంది. ప్రమాదానికి ముందు ఆమెను ఓ అమ్మాయి ఎందుకు ఫాలో అయ్యింది? ఆ తర్వాత అమ్మాయి ఎందుకు మిస్సయ్యిందనేది మిగతా కథ.

News November 30, 2024

రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు రద్దు

image

AP: వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో సుపరిపాలన, ఆస్తుల పరిరక్షణలో భాగంగా త్వరలోనే కొత్త బోర్డును నియమించింది. ప్రస్తుతం వైసీపీ హయాంలో నియమించిన బోర్డు అమల్లో ఉండటంతో రద్దు చేసింది.

News November 30, 2024

వేళ్లను విరవడం మంచిదా? కాదా?

image

వేళ్లను <<14753262>>విరవడం<<>> వల్ల నష్టం ఉందా? అనే దానిపై భిన్న వాదనలున్నాయి. సైంటిస్ట్ డోనాల్డ్ ఉంగర్ ఒకే చేతి వేళ్లను 60ఏళ్లు విరిచారు. అయినా ఎలాంటి దుష్ప్రభావం లేదని తేల్చారు. అయితే ఇష్టారీతిన లేదా తరచుగా విరవడం మంచిది కాదని, అలా చేయడం వల్ల ఎముక స్థానభ్రంశం చెందే ప్రమాదం కొందరు వైద్యులు అంటున్నారు. దీని వల్ల వేళ్లలో బలం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. కానీ, దానిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగలేదు.

News November 30, 2024

క్షీణించిన శిండే ఆరోగ్యం

image

మహారాష్ట్ర ఆపద్ధర్మ CM ఏక్‌నాథ్ శిండే ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఆయన ఇన్‌ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డెంగ్యూ, మలేరియా నెగటివ్ వచ్చాయన్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తూ మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. కాగా రానున్న 24 గంటల్లో మహా సీఎంపై శిండే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని శివసేన నేత శిర్సత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వార్త బయటికి రావడం గమనార్హం.

News November 30, 2024

EVM ఓట్లలో తేడా ఉంది కానీ ఆధారాల్లేవు: శరద్ పవార్

image

EVMల పనితీరుపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిలో నమోదు చేసిన ఓట్లలో తేడాలున్నాయని ఆరోపించారు. ‘ఓట్లలో కచ్చితంగా ఏదో తేడా కనిపిస్తోంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలేవీ ప్రస్తుతానికి నావద్ద లేవు. కొంతమంది రీకౌంటింగ్‌కి డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. కేంద్రంలోని NDA సర్కారు కారణంగా మహారాష్ట్ర ప్రజల్లో ఎన్నికలు ఆందోళన కలిగించాయి’ అని వ్యాఖ్యానించారు.