News November 30, 2024

రుణమాఫీ అరకొరగా చేశారు: కిషన్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో అరకొర రుణమాఫీ చేసి పూర్తిగా మాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తే, వాటినీ తామే భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటోందని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లే లేవని ఆయన పేర్కొన్నారు. HYDలో BJP సంఘటన్ పర్వ్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.

News November 30, 2024

వికెట్లు తీయడంలో బుమ్రాకంటే అర్షదీప్ బెటర్: చోప్రా

image

టీ20 ఫార్మాట్‌లో వికెట్లు తీయడంలో జస్ప్రీత్ బుమ్రా కంటే అర్షదీప్ మంచి బౌలరని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. ‘నైపుణ్యం పరంగా అర్షదీప్ స్థానం బుమ్రా తర్వాతే. కానీ వికెట్లు తీయడంలో మాత్రం బుమ్రాకంటే మెరుగైన బౌలర్’ అని అన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు(95) తీసిన రెండో బౌలర్‌గా అర్షదీప్ ఉన్నారు. మరో వికెట్ తీస్తే.. అత్యధిక వికెట్లు తీసిన చాహల్‌ను(96) సమం చేస్తారు.

News November 30, 2024

అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ..: పేర్ని నాని

image

AP: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైసీపీ నేతలు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఒక్కొక్కరిపై 10-12 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతూ, పాత కేసులను తిరగదోడుతోందని మండిపడ్డారు. ‘అధికారం ఎల్లకాలం ఉండదు చంద్రబాబూ.. గుర్తుంచుకో’ అని నాని సవాల్ విసిరారు.

News November 30, 2024

డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

image

* స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు TRAI కొత్తగా ట్రేసబిలిటీ రూల్‌ని తీసుకొచ్చింది. రేపటి నుంచి టెలికం సంస్థలు మోసపూరిత కాల్స్‌ను గుర్తించి నిరోధిస్తాయి.
* చమురు సంస్థలు సిలిండర్ ధరలు సవరిస్తాయి. రేపు ధరల్లో మార్పు జరగనుంది.
* SBI క్రెడిట్ కార్డ్స్‌ ద్వారా గేమింగ్‌కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ ఉండవు. రివార్డ్ పాయింట్స్‌ రిడెంప్షన్‌పై యాక్సిస్ బ్యాంక్ ఛార్జీలు వసూలు చేయనుంది.

News November 30, 2024

ప్రాక్టీస్ మ్యాచ్ ఫస్ట్ డే క్యాన్సిల్

image

ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా పడలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున ఆడనున్నాయి. డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే.

News November 30, 2024

36 నిమిషాల్లో ప్రత్యర్థి చిత్తు: ఫైనల్‌కు PV సింధు

image

స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ తన మునుపటి ఫామ్‌ను ప్రదర్శించారు. సయ్యద్ మోదీ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. యంగ్ షట్లర్, 17 ఏళ్ల ఉన్నతీ హుడాను కేవలం 36 నిమిషాల్లోనే 21-12, 21-9 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె లలిన్‌రత్ చైవాన్ (థాయ్) లేదా వు లువో యు (చైనా)తో తలపడాల్సి ఉంటుంది. సెమీస్‌లో ఆట ఆరంభం నుంచి దూకుడుగా ఆడానని, ఉన్నతికి అస్సలు ఛాన్సివ్వలేదని సింధు అన్నారు.

News November 30, 2024

లాంగెస్ట్ బస్సు సర్వీసు ఇదే!

image

ఒక్క రోజంతా బస్సులో ప్రయాణిస్తేనే అంతా అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. కానీ, 50 రోజుల పాటు నిరంతరంగా బస్సులో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకునేవారనే విషయం మీకు తెలుసా? లండన్ నుంచి కోల్‌కతా వరకు ఉండే బస్సు సర్వీసును అత్యంత పొడవైన బస్సు మార్గంగా పరిగణిస్తుంటారు. 32,669 కి.మీల ఈ ప్రయాణ మార్గాన్ని 1957లో ప్రారంభించగా 1976 వరకూ కొనసాగింది. ప్రయాణం, ఆహారం, వసతితో కలిపి రూ.1933 (1960లో) తీసుకునేవారు.

News November 30, 2024

GET READY: 4.56PMకు ‘పుష్ప-2’ టికెట్ బుకింగ్స్

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ టికెట్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం 4.56 గంటలకు ఓపెన్ కానున్నాయి. అయితే, తొలుత తెలంగాణలోనే ఇవి అందుబాటులో ఉండనున్నాయి. TG ప్రభుత్వం భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇవాళ రాత్రి లేదా రేపు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయగానే అక్కడ కూడా బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. టికెట్ ధరల పెంపుపై మీ కామెంట్?

News November 30, 2024

పాక్ ఓపెనర్ భారీ శతకం.. IND టార్గెట్ ఎంతంటే?

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ 281/7 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షహ్‌జైద్ భారీ సెంచరీతో అదరగొట్టారు. అతడు 147 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 159 రన్స్ చేశారు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 60 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో సమర్త్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు పడగొట్టారు. IND విజయానికి 282 రన్స్ అవసరం.

News November 30, 2024

పుష్ప-2 టికెట్ ధరలు భారీగా పెంపు

image

పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. DEC 4న రాత్రి 9.30, అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు ఓకే చెప్పింది. వీటి టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ₹800లుగా ఖరారు చేసింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ ₹150, మల్టీప్లెక్స్ ₹200 చొప్పున, డిసెంబర్ 9-16 వరకు సింగిల్ స్క్రీన్ ₹105, మల్టీప్లెక్స్ ₹150 చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.