News May 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 27, 2024

మే 27: చరిత్రలో ఈరోజు

image

1919: సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణం
1942: రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ జననం
1962: భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి జననం
1964: భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణం
1980: సంగీత దర్శకుడు సాలూరు హనుమంతరావు మరణం

News May 27, 2024

కేజ్రీవాల్ జైలుకు, రాహుల్ విదేశాలకు వెళ్తారు: అమిత్ షా

image

పంజాబ్‌ను కేజ్రీవాల్ అవినీతికి ATMగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు పంజాబ్ CM భగవంత్ మాన్ పైలట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్ నుంచే తీసుకెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్, AAP పంజాబ్‌ను డ్రగ్స్‌ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్ 1న కేజ్రీవాల్ జైలుకు, 6న రాహుల్ విదేశాలకు వెళ్తారని లూథియానా ర్యాలీలో వ్యాఖ్యానించారు.

News May 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 27, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 27, సోమవారం
బ.చవితి: సాయంత్రం 04:53 గంటలకు
పూర్వాషాడ: ఉదయం 10.13 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:21 వరకు
తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు
వర్జ్యం: సాయంత్రం 6:00 నుంచి రాత్రి 7:33 వరకు

News May 27, 2024

IPL ఛాంపియన్స్ (2008-2024)

image

2008- రాజస్థాన్ రాయల్స్
2009- డెక్కన్ ఛార్జర్స్
2010, 2011, 2018, 2021, 2023- చెన్నై సూపర్ కింగ్స్
2012, 2014, 2024 – కోల్‌కతా నైట్ రైడర్స్
2013, 2015, 2017, 2019, 2020 – ముంబై ఇండియన్స్
2016 -సన్‌రైజర్స్ హైదరాబాద్
2022- గుజరాత్ టైటాన్స్

News May 27, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఐపీఎల్-2024 విజేత KKR
* ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా
* AP: పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని
* TG: రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదం: ఉత్తమ్
* TG: సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కామ్: KTR
* TG: జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
* TG: రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక

News May 26, 2024

ఇజ్రాయెల్‌పైకి హమాస్ క్షిపణుల వర్షం

image

నాలుగు నెలల విరామం తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్‌పైకి హమాస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ మేరకు ఆ సంస్థ సాయుధ శాఖ అల్-కసాం బ్రిగేడ్స్ ప్రకటించింది. టెల్ అవీవ్‌పై భారీ క్షిపణి దాడుల్ని చేయనున్నట్లు పేర్కొంది. అటు ఇజ్రాయెల్ రాజధానిలో సైరన్లను యాక్టివేట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

News May 26, 2024

ట్రోల్స్‌కు స్టార్క్ బదులిచ్చాడుగా: KKR

image

స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ తనపై వచ్చిన ట్రోల్స్‌కు బదులిచ్చారని KKR పేర్కొంది. ఇవాళ SRHతో ఫైనల్లో ప్రదర్శనను ఉద్దేశించి స్టార్క్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారని మార్ఫ్‌డ్ ఫొటోను Xలో షేర్ చేసింది. క్వాలిఫయర్-1లో మూడు వికెట్లు తీసిన స్టార్క్, ఇవాళ్టి మ్యాచులోనూ 2 వికెట్లు తీశారు. వేలంలో రూ.24.75 కోట్లు పలికిన ఈ ఆసీస్ బౌలర్, లీగ్ దశలో విఫలమవ్వడంతో నెటిజన్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

News May 26, 2024

మరోసారి హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్

image

AP: హత్యాయత్నం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనలో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జూన్ 5 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం తీర్పిచ్చింది.