India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు జరుగుతున్నాయి. సన్న రకాలకు ₹500 బోనస్ ఇవ్వాలి. రోజూ ధాన్యం కొనుగోళ్లపై నివేదిక ఇవ్వాలి’ అని CM సూచించారు.

చైనాకు, మొరాకోకు 12వేల కిలోమీటర్ల దూరం. కానీ చైనాలోని షాంఘైలో ఉన్న వైద్యుడు మొరాకోలో ఉన్న రోగికి రోబోటిక్ విధానంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీని ఈ నెల 16న నిర్వహించారు. ఇంత దూరం నుంచి రిమోట్ సర్జరీ చేసిన తొలి వైద్యుడిగా రికార్డుకెక్కారు. దీనికోసం టౌమాయ్ రోబోట్‌ను, అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రెండు గంటల్లోనే ఆపరేషన్ ముగిసిందని, రోగి కోలుకుంటున్నారని తెలిపారు.

IPL వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని RR దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ అసలు IPL ఆడేందుకు అర్హుడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. IPLలో ఆడేందుకు కనీస నిబంధనలేవీ లేవు. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలి. అయితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు డిక్లరేషన్ సమర్పించి 15 ఏళ్లలోపు వారినీ ఆడించొచ్చు. పాక్‌కు చెందిన హసన్ రజా(14 ఏళ్ల 227 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కుడు.

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలను TGPSC విడుదల చేసింది. IPM పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదలైంది. 16వేల మందికి పైగా దరఖాస్తు చేయగా, ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైంది. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <

గజిని సినిమా సమయంలో తాను దారుణమైన ట్రోలింగ్‌కు, అవహేళనకు గురయ్యానని నటి నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో తెలిపారు. ‘గజిని సినిమాకి అసలు నన్నెందుకు తీసుకున్నారంటూ కొంతమంది ప్రశ్నించారు. ఇంత లావుగా ఉండి ఎందుకు నటిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. నటనపై విమర్శిస్తే తీసుకుంటాను. కానీ బాడీ షేమింగ్ తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో అదే అత్యంత బాధపడిన సందర్భం’ అని వెల్లడించారు.

AP: పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా కొత్త టెక్స్‌టైల్ పాలసీ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దీన్ని రూపకల్పన చేశామన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఎస్సీ, ST, BC, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, రానున్న క్యాబినెట్‌లో దీనిపై చర్చిస్తామన్నారు.

IPL వేలంపాట ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. వరల్డ్ క్లాస్ ఫారిన్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఆటగాళ్లు ఫామ్‌లో లేకున్నా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచి కొనుక్కునేవి. కానీ ఈసారి అలాంటిదేం కనిపించలేదు. విలియమ్సన్, వార్నర్, బెయిర్‌స్టో, స్మిత్, మిచెల్, ఆదిల్ రషీద్, జోసెఫ్, హోల్డర్, నబీ, సౌథీ వంటి టాప్ ప్లేయర్లు ఇటీవల ఫామ్‌లో లేకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్‌ను విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు సిలబస్ కోసం <

దేశంలో బ్యాలెట్ ఓటింగ్‌కు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు గెలిస్తే EVMలు బాగా పనిచేసినట్టు. ఓడిపోతే ట్యాంపర్ చేసినట్టా? గతంలో చంద్రబాబు ఓడిపోయినప్పుడు EVMలను ట్యాంపర్ చేయవచ్చన్నారు. ఇప్పుడు జగన్ ఓడిపోవడంతో వాటిని ట్యాంపర్ చేయవచ్చని ఆయనా అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్స్ కొట్టేసింది.

TG: ఇటీవల శుభకార్యాల్లో డబ్బు ఇవ్వాలని ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లోని ఓ గృహప్రవేశ కార్యక్రమంలో డబ్బు ఇవ్వాలంటూ ఆ ఇంటి యజమానులను కొందరు ట్రాన్స్‌జెండర్లు ఇబ్బంది పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.