India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

HYD లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. ‘గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోటును ప్రపంచస్థాయిలో తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇక్కడ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, శాంతి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాలను బదిలీ చేయండి’ అని CM కోరారు.

పుష్ప-2 షూటింగ్ పూర్తైనట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. పుష్ప లాస్ట్ డే షూట్ అంటూ బన్నీ ఓ ఫొటోను పంచుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన సీన్ షూటింగ్ ఇవాళ జరిగినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. ‘పుష్ప యూనిట్‌తో ఐదేళ్ల ప్రయాణం ముగిసింది. అద్భుతమైన ప్రయాణం’ అంటూ లవ్ సింబల్‌ను ఆయన పోస్ట్ చేశారు. కాగా డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈ నెల 29న ICC తుది నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్, భారత్ పర్యటన, హైబ్రిడ్ మోడల్ వంటి విషయాలపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సమాచారం. కాగా హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచుతామని ICC ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచులను UAEలో నిర్వహించాలని, ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరపాలని పాక్‌ను కోరినట్లు సమాచారం.

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా బలపడుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి కాకినాడ, కోనసీమ, కృష్ణా, NLR, YSR, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, TPTY జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది.

AP: అమరావతిలో ఏర్పాటు చేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానంగా 5 జోనల్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర హబ్‌లకు కేంద్రంగా అమరావతి హబ్ పనిచేస్తుందన్నారు. 5 జోనల్ హబ్‌లకు దేశంలోని 25 IITలను లింక్ చేయాలని సూచించారు. అటు APలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల సంఖ్యపై వివరాలు సేకరించాలని నూతన IT పాలసీలపై సమీక్షలో CM చెప్పారు.

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్‌డ్జీ అనే యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాగా ఆమె ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా ఆమె ఆర్టిస్ట్ అని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లను ఆమె ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఇండియాతో పాటు దుబాయ్, లండన్‌లో పెరిగినట్లు సమాచారం. ఆమె తండ్రి జుల్ఫీ రవ్‌డ్జీ బిజినెస్‌మ్యాన్. 27ఏళ్ల జైనాబ్‌తో అఖిల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తొలి సినిమా ‘పాంచ్’ 22 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుంది. 1976-77లో పుణేలో జరిగిన సీరియల్ హత్యల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో డ్రగ్స్ వాడకం, హింస, అశ్లీల పదాల కారణంగా 2002లో విడుదలకు అనుమతి లభించలేదు. ఇన్నేళ్ల తర్వాత సెన్సార్ బోర్డు అంగీకారంతో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత టుటూ శర్మ తెలిపారు. ప్రస్తుతం పాడైన నెగటివ్ కాపీ మరమ్మతులు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఐపీఎల్ వేలంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలుత అన్‌సోల్డ్‌గా మిగిలారు. గంట వ్యవధిలోనే మళ్లీ ఆయన పేరు వేలంలో ప్రత్యక్షమైంది. వెంటనే ముంబై ఇండియన్స్ ఆయనను బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ బిడ్ వెనుక ఏదో జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుందో కామెంట్ చేయండి.

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ జైనాబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండగా, అఖిల్‌ది కూడా అదేరోజున అదే వేదికపై జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల వివాహాలు ఒకేరోజున, ఒకే వేదికపై జరిగితే ఫ్యాన్స్‌కు కనుల పండుగే.
Sorry, no posts matched your criteria.