News November 26, 2024

IPL: వీరిని ఇక చూడలేము!

image

ఐపీఎల్ మెగావేలం ముగిసింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన ప్లేయర్లు కొందరు అన్ సోల్డ్‌గా మిగిలారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మిచెల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, హోల్డర్, జోర్డాన్, నబీ, లాథమ్, సౌథీ, సికిందర్ రాజా, మయాంక్ అగర్వాల్, షకీబ్, పృథ్వీ షా, సర్ఫరాజ్, శివమ్ మావి, సైనీ, చావ్లా వంటి ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.

News November 26, 2024

IPL 2025: ధరలో టాప్-10 ప్లేయర్లు

image

1. రిషభ్ పంత్- రూ.27 కోట్లు(LSG)
2. శ్రేయాస్ అయ్యర్- రూ.26.75 కోట్లు(PBKS)
3. వెంకటేశ్ అయ్యర్- రూ.23.75 కోట్లు(KKR)
4. అర్ష్‌దీప్ సింగ్- రూ.18 కోట్లు(PBKS)
5. యుజ్వేంద్ర చాహల్- రూ.18 కోట్లు(PBKS)
6. జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు(GT)
7. KL రాహుల్- రూ.14 కోట్లు(DC)
8. ట్రెంట్ బౌల్ట్- రూ.12.5 కోట్లు(MI)
9. హాజిల్‌వుడ్- రూ.12.5 కోట్లు(RCB)
10. జోఫ్రా ఆర్చర్- రూ.12.5 కోట్లు(RR)

News November 26, 2024

మహారాష్ట్ర CM పీఠానికి 2 ఆప్షన్లు!

image

మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించగా CM పీఠం ఎవరిదనే దానిపై ఉత్కంఠ వీడలేదు. 2 ఆప్షన్లపై కూటమి నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే చెరో రెండున్నరేళ్లు కుర్చీ పంచుకోవడం తొలి ఆప్షన్ కాగా, 2+2+1(ఫడణవీస్, శిండే, అజిత్ పవార్) ఫార్ములాతో సీఎం పీఠాన్ని అధిష్ఠించడం రెండో ఆప్షన్. రెండ్రోజులుగా దీనిపై నడ్డా, అమిత్ షా చర్చలు జరుపుతుండగా ఇవాళ ఫైనల్ అయ్యే ఛాన్సుంది.

News November 26, 2024

మినీ బస్సు బోల్తా.. ఆరుగురు ‘కాంతార’ నటులకు గాయాలు

image

‘కాంతార: ఛాప్టర్-1’ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక జడ్కల్‌లోని ముదూర్‌లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అది చిన్న ప్రమాదమేనని, యథావిధిగా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.

News November 26, 2024

నేడు ‘రాజ్యాంగ దినోత్సవం’.. ఎందుకంటే?

image

మన రాజ్యాంగానికి 1949 NOV 26న ఆమోదం లభించినా స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటీషర్లు మభ్యపెట్టడంతో అమలుకు 2నెలలు పట్టింది. అంతకముందు నెహ్రూ తక్షణ స్వాతంత్ర్యానికి 1929 DEC 31న జెండాను ఎగరేశారు. ఆపై 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి 1950లో అదే రోజు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 2015న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125జయంతి సంవత్సరం సందర్భంగా PM మోదీ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.

News November 26, 2024

బంగ్లాలో ‘ఇస్కాన్’ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీచిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్‌కి తరలించారు. అయితే ఈ విషయాన్ని మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు.

News November 26, 2024

పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News November 26, 2024

ఎన్నికలకు ముందే చంద్రబాబుతో మాట్లాడా: బాలినేని

image

AP: మాజీ సీఎం జగన్‌తో రాజకీయ ప్రయాణం వల్ల తన ఆస్తిని మొత్తం అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీని వీడుదామనుకున్నానని, ఈ విషయంపై చంద్రబాబుతో కూడా మాట్లాడానని తెలిపారు. ఆయన టీడీపీలోకి ఆహ్వానించి, మంత్రి పదవి ఆఫర్ చేశారని చెప్పారు. అయితే అప్పుడు తన రాత బాగోలేక పార్టీ వీడలేదని పేర్కొన్నారు.

News November 26, 2024

మూడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధులివే

image

వివిధ పద్దుల కింద FY22-24 మధ్య మూడేళ్లలో ఏపీకి రూ.1.48 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది. అలాగే నవభారత సాక్షరత కార్యక్రమం(ఉల్లాస్) కింద ఏపీలో 30.70 లక్షల మంది నమోదైతే తెలంగాణలో ఆ సంఖ్య 75 మాత్రమేనని కేంద్ర మంత్రి జయంత్ చౌధరి చెప్పారు.

News November 26, 2024

నేటి నుంచి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో 3 రోజులు వానలుంటాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.