India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: FY23లో గుడ్లు, ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో నాలుగు, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచినట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆ కాలంలో 2,78,498 లక్షల గుడ్లు, 10.94 లక్షల టన్నుల మాంసం, 154 లక్షల టన్నుల పాల దిగుబడి సాధించినట్లు తేలింది. 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది.

IPL-2025 మెగా ఆక్షన్‌లో తెలంగాణ క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో అతను వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. గత సీజన్‌లో CSK అతడిని కొనుగోలు చేసినా తుది జట్టులో ఆడించలేదు. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటుదామనుకుంటే ఏ జట్టు తీసుకోకపోవడంతో అతనికి నిరాశ ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్‌కు చెందిన ఈ 19 ఏళ్ల వికెట్ కీపర్ భారత U19 జట్టుకూ సెలక్ట్ అయ్యారు.

TG: ఢిల్లీలో ఉన్న CM రేవంత్ ఇవాళ రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించి, ఆ తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమయం దొరికితే పార్టీ అగ్రనేతలతోనూ భేటీ అయి, ఎంపీగా గెలిచిన ప్రియాంకకు విషెస్ చెప్పనున్నట్లు సమాచారం.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎంపికపై కూటమి నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన(శిండే), NCP(అజిత్) మద్దతు కీలకంగా మారింది. మరోవైపు ఇవాళ్టితో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో సాయంత్రంలోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.

సోషల్ మీడియాలో పోస్టుల కేసులో RGV పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు HYD వచ్చారు. RGV ఇంట్లో లేరని సిబ్బంది వారిని అడ్డుకోవడంతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన HYD లేదా కోయంబత్తూరులో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే RGV పోలీసులకు చిక్కకుండా ఉన్నారని వార్తలొస్తున్నాయి.

APలోని విశాఖ నుంచి ఖరగ్‌పూర్(బెంగాల్) మధ్య ఒడిశా మీదుగా 783KM మేర ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా దీనికి DPR రూపొందించేందుకు NHAI టెండర్లు పిలిచింది. 2025 జూన్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకోవచ్చు. భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.

AP: ఇంటింటికీ సోలార్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో 100శాతం సౌర విద్యుత్ వినియోగాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను కేవలం సోలార్ విద్యుత్ వినియోగించేలా మార్చాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

IPL-2025 మెగా వేలం నిన్న రాత్రి అట్టహాసంగా ముగిసింది. మొత్తం 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. దాదాపు అన్ని జట్లలో చాలామంది కొత్త ఆటగాళ్లు వచ్చి చేరారు. పైనున్న ఇమేజ్‌లలో జట్ల రిటెన్షన్, కొనుగోలు చేసిన ప్లేయర్ల వివరాలు చూడొచ్చు. కాగా వచ్చే ఏడాది మార్చి 14న మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మరి మీ ఫేవరెట్ జట్టేదో కామెంట్ చేయండి.

TG: వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. DEC 16న జరిగే RRB పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.
Sorry, no posts matched your criteria.