News May 25, 2024

IPL.. అదరగొట్టిన SRH నిర్ణయం

image

RRతో 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ రూల్‌ను SRH సద్వినియోగం చేసుకుంది. ఇన్నాళ్లూ పెద్దగా ప్రభావం చూపని షాబాజ్ అహ్మద్.. నిన్నటి మ్యాచ్‌లో ఇంపాక్ట్‌గా వచ్చి బ్యాటింగ్‌లో 18 రన్స్ చేశారు. స్పిన్‌కు సహకరించిన చెపాక్‌లో 3 వికెట్లు తీసి పటిష్ఠ స్థితిలో ఉన్న RRను గట్టి దెబ్బకొట్టాడు. జోరు మీదున్న యశస్వీ జైస్వాల్‌తో పాటు రియాన్ పరాగ్, అశ్విన్‌లను పెవిలియన్ పంపి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచారు.

News May 25, 2024

జూన్ 4 టెన్షన్.. ఏపీవ్యాప్తంగా తనిఖీలు

image

AP: ఓట్ల లెక్కింపు జరిగే జూన్4న అల్లరు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఏపీవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు సహా అనుమానిత ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆయుధాలు, గుర్తింపు లేని వాహనాలు, పేలుడు పదార్థాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

News May 25, 2024

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు: కేఏ పాల్

image

AP: దేశంలో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు. ఈవీఎంలు పగలగొడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా విశాఖలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కూడా సెక్యూరిటీపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

News May 25, 2024

రేపే JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నిమిషం లేటయినా నో ఎంట్రీ

image

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా 1.91 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో AP, TGకి చెందిన వారే 46వేల మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. బంగారు ఆభరణాలు, బూట్లు, డిజిటల్ పరికరాలను తీసుకెళ్లకూడదు. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. జూన్ 9న కీ, ఫలితాలను వెల్లడిస్తారు. 10 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

News May 25, 2024

ఆరోగ్య శ్రీ సేవలు యథాతథం

image

AP: ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు దిగివచ్చాయి. సీఎస్ జవహర్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో స్కీమ్ సేవల్ని యథాతథంగా కొనసాగించనున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మరో రూ.300 కోట్ల నిధుల విడుదలకు సీఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయి పడింది. ఇటీవల రూ.203 కోట్లు విడుదల చేసింది.

News May 25, 2024

తగ్గనున్న రేంజ్ రోవర్ ధరలు!

image

భారత్‌లో టాటా మోటార్స్‌కు చెందిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ల ధరలు త్వరలో తగ్గనున్నాయి. దేశంలో వీటి ఉత్పత్తిని ప్రారంభించడమే ఇందుకు కారణం. సంస్థ 54 ఏళ్ల చరిత్రలో బ్రిటన్ వెలుపల తొలిసారిగా వీటిని తయారు చేయడం విశేషం. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో వీటి ధరలు 18-22% తగ్గనున్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ.1.9 కోట్ల నుంచి 1.4 కోట్లకు, రేంజ్ రోవర్ రూ.3.3కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు తగ్గనుంది.

News May 25, 2024

ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన ఇద్దరు లోకోపైలెట్లు సస్పెన్షన్

image

పరిమితికి మించి స్పీడ్‌తో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ లోకోపైలెట్లను రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్ సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో అక్కడ స్పీడ్‌ను 20 kmలకు తగ్గించారు. కానీ ఇటీవల గతిమాన్(ఢిల్లీ-యూపీ), మాల్వా ఎక్స్‌ప్రెక్స్‌(జమ్మూ-MP) 120kmల వేగంతో పరుగులు తీసినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు.

News May 25, 2024

మేం పోరాడితే కాంగ్రెస్‌కు పట్టం కట్టారు: బండి

image

TG: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ నేత బండి సంజయ్ అన్నారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాడితే.. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండవ స్థానం కోసమే ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. 6గ్యారంటీలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

News May 25, 2024

నేడు లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్‌లో 1, ఝార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, UP 14, బెంగాల్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 4న ఫలితాలు వెల్లడవుతాయి.

News May 25, 2024

చాహల్ చెత్త రికార్డు

image

ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకుని.. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆయన రెండు సిక్సులిచ్చారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆయన 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ నిరాశపర్చారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.