News November 26, 2024
సంజూ శాంసన్ సేన ఇదే
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి రాజస్థాన్ రాయల్స్ 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, పరాగ్, జురేల్, హెట్‌మయర్, సందీప్ శర్మ, ఆర్చర్, తీక్షణ, హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, నితీశ్ రాణా, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే, యుధ్విర్ సింగ్, ఫరూఖీ, సూర్యవంశీ, మఫాకా, రాథోడ్, అశోక్ శర్మ
Similar News
News December 7, 2024
ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్
TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.
News December 7, 2024
వీకెండ్స్ మాత్రమే తాగినా ప్రమాదమే!
వారంలో ఒక రోజు మద్యం సేవించినా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లివర్ డాక్టర్‌గా పేరొందిన సిరియాక్ ఫిలిప్ వారంలో ఒక రోజు మద్యం సేవించే 32 ఏళ్ల యువకుడి లివర్ దెబ్బతిన్న తీరును ప్రత్యేక్షంగా చూపించారు. ఆ యువకుడి భార్య ఇచ్చిన ఆరోగ్యవంతమైన లివర్‌తో దాన్ని పోలుస్తూ పంచుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఏ మోతాదులో తీసుకున్నా మద్యపానం హానికరమని చెబుతున్నారు. Share It.
News December 7, 2024
ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా: బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షోలో హీరో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్‌గా చేస్తానని చెప్పారు. ఈ షోకు నవీన్ పొలిశెట్టి, శ్రీలీల అతిథులుగా రాగా వారితో సరదాగా సంభాషించారు. మరోవైపు తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్ చెప్పారు. తన ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లే అని, తాను మాత్రం నటనను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.