News November 25, 2024

మరో పేసర్‌ను కొన్న MI

image

ముంబై ఇండియన్స్ మరో పేసర్‌ను కొనుగోలు చేసింది. CSK మాజీ ప్లేయర్ దీపక్ చాహర్‌ను వేలంలో రూ.9.25 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు ముకేశ్ కుమార్‌ను రైట్ టు మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ముకేశ్‌ కోసం పంజాబ్‌ అత్యధిక బిడ్ దాఖలు చేయగా, RTM పద్ధతిలో DC రూ.8 కోట్లకు అతడిని దక్కించుకుంది.

News November 25, 2024

భువనేశ్వర్‌కు జాక్ పాట్.. ఏ జట్టు కంటే?

image

ఐపీఎల్ మెగా వేలంలో టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జాక్ పాట్ తగిలింది. రూ.10.75 కోట్లకు ఆర్సీబీ అతడిని దక్కించుకుంది. తొలి నుంచి లక్నో, ముంబై జట్లు భువీ కోసం పోటీపడ్డాయి. కానీ చివర్లో అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి వచ్చి అతడిని ఎగరేసుకుపోయింది.

News November 25, 2024

విదేశీ మారకం: RBI Gold Strategy

image

FIIల డిజిన్వెస్ట్‌మెంట్‌తో తరుగుతున్న విదేశీ మారక నిల్వల సమతుల్యం కోసం RBI భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. ఇటీవ‌ల 44.76 ట‌న్నుల గోల్డ్ కొన‌డం ద్వారా నిల్వ‌లు 866 ట‌న్నుల‌కు చేరుకున్నాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య విదేశీ కరెన్సీ ఆస్తులు $1.1 బిలియన్ల మేర తగ్గినప్పటికీ, బంగారం నిల్వల విలువ $13 బిలియన్ల మేర పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం $658 బిలియన్లుగా ఉన్నాయి.

News November 25, 2024

జిరాఫీ అంతరించిపోతోంది!

image

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జంతువులుగా పరిగణిస్తోన్న జిరాఫీలు అంతరించిపోతున్నాయి. వేటాడటం, పట్టణీకరణ, వాతావరణ మార్పుల కారణంగా జిరాఫీలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈక్రమంలో US ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ దీనిని అంతరించి పోతున్న జాతిగా పరిగణించి, వాటిని రక్షించేందుకు ముందుకొచ్చింది. ఈ జాతిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.

News November 25, 2024

తుషార్‌ను కొనుగోలు చేసిన RR

image

CSK మాజీ పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అతడి కోసం CSK కూడా పోటీ పడింది. కానీ చివరికి తుషార్‌ను RR రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ కోయెట్జీని గుజరాత్ రూ.2.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లిస్‌ను రూ.2.60 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.

News November 25, 2024

ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వద్దని కొద్దిసేపటి క్రితం రేవంత్ ప్రకటించారు. ఈమేరకు అదానీకి లేఖ రాశారు.

News November 25, 2024

సంచలనం.. T20Iలో ఏడు పరుగులకు ఆలౌట్

image

అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. T20Iలలో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 స్కోర్ చేయగా, ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు డకౌట్లు కాగా, ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 రన్స్ చేశారు. గతంలో మంగోలియా 10రన్స్‌కే(vsసింగపూర్) ఆలౌటైంది.

News November 25, 2024

మంత్రి లోకేశ్‌తో చాగంటి భేటీ

image

AP: విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించినట్లు లోకేశ్ తెలిపారు. ఇందుకు తనవంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.

News November 25, 2024

తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు షాక్

image

ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌ను ఎవరూ కొనలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆయనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఇంగ్లండ్ విధ్వంసకర ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, విండీస్ ప్లేయర్ షయ్ హోప్‌ను కూడా ఎవరూ కొనలేదు.

News November 25, 2024

WTC: మళ్లీ భారత్ నంబర్-1

image

తొలి టెస్టులో ఆసీస్‌పై ఘన విజయంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 9 విజయాలు, 5 ఓటములతో 61.11 శాతంతో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా(57.69 శాతం) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక(55.56%), కివీస్(54.55%), సౌతాఫ్రికా(54.17%), ఇంగ్లండ్(40.79%), పాక్(33.33%), బంగ్లాదేశ్(27.50%), విండీస్(18.52%) ఉన్నాయి.