News August 27, 2024

బండి సంజయ్‌పై ధిక్కార చర్యలు తీసుకోండి: సుప్రీంకు KTR విజ్ఞప్తి

image

MLC కవిత బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన <<13951590>>ట్వీట్‌కు<<>> కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘బాధ్యతాయుతమైన హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీంకోర్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ఈయనపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతున్నా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

News August 27, 2024

కవితకు బెయిల్.. ED, CBIలకు మందలింపు

image

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో BRS MLC కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ED, CBIలను మందలించింది. ఆ దర్యాప్తు సంస్థల విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్రూవర్లను సాక్షులుగా ఎంపిక చేసుకోవడాన్ని జస్టిస్ B.R.గవాయ్, జస్టిస్ K.V.విశ్వనాథన్ ధర్మాసనం తప్పుబట్టింది. అప్రూవర్‌లుగా మారిన నిందితుల సాక్ష్యాలను ఎలా పరిగణిస్తారంటూ ప్రశ్నించింది. విచారణ పారదర్శకంగా సాగాలని సూచించింది.

News August 27, 2024

50 రోజుల్లో శిక్ష విధించాలి: TMC MP

image

దేశంలో అత్యాచార ఘటనలకు సంబంధించి 26% కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయని TMC MP అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో 50 రోజుల్లో విచారణ జరిపి శిక్ష అమలు చేసేలా యాంటీ రేప్ లా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి 100 కేసుల్లో 26 మందే శిక్షలు అనుభవిస్తున్నారని, 74 మంది తప్పించుకుంటున్నారని వివరించారు. దేశంలో గత 15 రోజుల్లో మహిళలపై 24 రేప్, దాడుల ఘటనలు జరిగాయని పలు కథనాలను Xలో పోస్ట్ చేశారు.

News August 27, 2024

కవితకు బెయిల్.. BJP vs కాంగ్రెస్

image

TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో BRS MLC కవితకు బెయిల్ రావడంతో BJP vs కాంగ్రెస్ ఫైట్ మొదలైంది. BJPతో BRS కుమ్మక్కు కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బెయిల్‌పై కేంద్రమంత్రి, BJP నేత బండి సంజయ్ స్పందిస్తూ ‘కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలోనూ ఇరు వర్గాలు పోటాపోటీగా ట్వీట్లు చేసుకుంటున్నాయి.

News August 27, 2024

మార్కెట్‌లోకి ఓరల్ కలరా వ్యాక్సిన్

image

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ‘హిల్‌కాల్’ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,479 కలరా కేసులు నమోదయ్యాయి. 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓరల్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ విడుదల చేసింది.

News August 27, 2024

రేపు ఉదయం ప్రెస్ మీట్.. సాయంత్రం హైదరాబాద్‌కు రాక

image

TG: బెయిల్‌పై విడుదలైన BRS MLC కల్వకుంట్ల కవిత రేపు హైదరాబాద్ రానున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆమె జైలు నుంచి విడుదలవుతారు. ఈ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేసి, రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం ఆమె విమానంలో రాష్ట్రానికి చేరుకుంటారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై 5 నెలలుగా కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

News August 27, 2024

BSP జాతీయ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన మాయావతి

image

BSP జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. BSP సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది. రాజకీయాల నుంచి మాయావతి రిటైర్ అవుతున్నట్టు వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఆమె ఇటీవల కొట్టిపారేశారు. బహుజనులను బలహీనపరిచే కుట్రలను తిప్పికొట్టడానికి తుదిశ్వాస వరకు పనిచేస్తానని స్పష్టం చేశారు.

News August 27, 2024

పౌరస్వేచ్ఛ ప్రశ్నార్థకమైనప్పుడు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

image

పౌరస్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారినప్పుడు కిందిస్థాయి కోర్టులు ముందస్తు బెయిల్ పిటిషన్లను స్వీకరించాలని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా లేదా తాత్కాలిక రక్షణ కల్పించేలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలంది. కిందికోర్టులు వీటిని చేపట్టకపోతే హైకోర్టులపై భారం పెరుగుతుందని పేర్కొంది. స్థానిక నేత ప్రీ అరెస్టు బెయిల్‌పై థాణే జిల్లా కళ్యాణ్ కోర్టు నిర్ణయం ఆలస్యమవ్వడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News August 27, 2024

రిషభ్ పంత్ గొప్ప మనసు

image

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నారు. కాలేజీ ఫీజు కట్టలేకపోయిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఆర్థిక సాయం చేశారు. రూ.90వేలు ఫీజు చెల్లించి ఆ విద్యార్థికి అండగా నిలిచారు. సోషల్ మీడియాలో సాయం చేయాలని ఆ విద్యార్థి వేడుకోగా పంత్ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ T20 WC విన్నింగ్‌ జట్టులో సభ్యుడు. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశం ఉంది.

News August 27, 2024

కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్‌దే: బండి సంజయ్

image

TG: BRS MLC కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. క్రైమ్, వైన్, డైన్‌లో భాగస్వాములైన BRS, కాంగ్రెస్‌ల అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ తరఫు న్యాయవాదులకు శుభాకాంక్షలు. కవిత బెయిల్‌పై బయటకు రావడం, ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో KCR చతురత ప్రదర్శించారు’ అని సెటైర్లు వేశారు.