India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట దక్కింది. మార్చి 15 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు గంటన్నర పాటు కవిత లాయర్ ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఎస్వీ రాజు మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. కవిత బెయిల్‌కు అర్హురాలన్న రోహత్గీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించి బెయిల్ ఇచ్చింది.
AP: బాలీవుడ్ హీరోయిన్‌ను జగన్, సజ్జల వేధించారంటూ TDP చేసిన <<13950822>>ఆరోపణలపై<<>> YCP ఫైరయ్యింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది. ‘రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం మీ సిద్ధాంతం. NTRకు వెన్నుపోటును ప్రజాస్వామ్యమన్నారు. బాలకృష్ణ తుపాకీతో కాల్చితే మెంటల్ సర్టిఫికెట్ తెచ్చారు. లోకేశ్ మహిళలతో తైతక్కలాడితే చిన్ననాటి సరదాలు అన్నారు. మీలో నైతికత ఇసుమంతైనా లేదు’ అని మండిపడింది.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, ఆర్ సింగ్ ఠాకూర్, హేమలత, శోభన, రాధా యాదవ్, శ్రేయాంకా పాటిల్, సజీవన్. ట్రావెలింగ్ రిజర్వ్: ఉమా ఛెత్రీ, తనూజా, సైమా.
AP: గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వీటిని EC నివృత్తి చేయాలని YCP నేత అంబటి రాంబాబు కోరారు. CEO వివేక్ యాదవ్‌తో YCP నేతల భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ‘ఏ అసెంబ్లీ స్థానంలో, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈసీ ప్రకటించాలి. పోలింగ్ శాతాన్ని 3 సార్లు ప్రకటించడం విడ్డూరం. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయటం లేదు? దీనిపై ఎన్నికల కమిషన్ అశ్రద్ధ వహిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
మంకీపాక్స్‌ను నిర్ధారించే స్వదేశీ RT-PCR కిట్‌ను భారత్ అభివృద్ధి చేసింది. సీమెన్స్ హెల్త్‌నీర్స్ రూపొందించిన IMDX కిట్ల ఉత్పత్తిని CDSCO ఆమోదించింది. ఏటా 10 లక్షల సామర్థ్యం గల వడోదరాలోని ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. ఇవి మంకీపాక్స్ వైరస్ క్లాడ్ 1, 2 వేరియంట్లను సమర్థంగా గుర్తిస్తాయంది. సాధారణంగా 1-2 గంటలు పట్టే ఫలితం తమ కిట్‌తో 40 నిమిషాల్లోనే వస్తుందని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అసలు వాటాదారు కవితేనని సుప్రీంకోర్టులో ఈడీ వాదించింది. అరుణ్ పిళ్లై డమ్మీగా ఉన్నారని, తెరవెనుక కవితే కథ నడిపారని ఆరోపించింది. మరోవైపు పిళ్లై వెనక్కి తీసుకున్న వాంగ్మూలాన్ని పక్కనపెట్టి, అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలాన్నే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీం తెలిపింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ తర్వాత అట్లీ డైరెక్షన్‌లో సినిమా తీస్తారని గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఉంటుందా? లేదా? అనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణపై సన్ పిక్చర్స్, అల్లు అర్జున్, అట్లీ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్ 6న ‘పుష్ప-2’ విడుదల కానుంది.
తమకు సమయం సందర్భం లేకుండా ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయని ఓ కార్డియాలజిస్ట్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. గుండె సంబంధిత సమస్యలతో వచ్చిన రోగికి ప్రతి నిమిషం ఎంతో ముఖ్యమని, నిద్రాహారాలు మానేసి ప్రాణాలు రక్షిస్తామని చెప్పారు. ‘3.30amకు ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చిందని కాల్ రాగానే ఆస్పత్రికి పరిగెత్తి యాంజియోప్లాస్టీ చేసి బతికించా’ అని చెప్పారు. దీంతో వైద్యులు దేవుళ్లంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
AP: YS జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై TDP సంచలన ఆరోపణలు చేసింది. ‘బాలీవుడ్ హీరోయిన్ కోసం నువ్వు, నీ సలహాదారుడు కలిసి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా? స్పెషల్ ఫ్లైట్లలో ఆమెను విజయవాడ తీసుకొస్తారా? ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బంధించి వేధిస్తారా? ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికా? బెంగళూరులో అసలు నువ్వు ఏం చేస్తున్నావ్? సమాధానం చెప్పు జగన్?’ అని జగన్, సజ్జల ఫొటోను ట్వీట్ చేసింది.
AP: రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో పనిచేసేందుకు వీలుగా విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డిప్యూటీ సెక్రటరీ/డైరెక్టర్ క్యాడర్‌లో నియామకాలకు CS, స్పెషల్ CSలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుచేసింది. అంతకంటే కింది స్థాయిలో నియామకాలను GAD పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తుంది. వీరు రీఅపాయింట్‌మెంట్ కోసం CM అనుమతి పొందాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.