India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సత్తా ఉన్నప్పటికీ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్-15లో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. దీనిపై రింకూ తాజాగా స్పందించారు. ‘రోహిత్ భాయ్ నా దగ్గరకు వచ్చి అర్థమయ్యేలా చెప్పారు. నేను ఇంకా చాలా చిన్నవాడినేనని, భవిష్యత్తులో చాలా ప్రపంచ కప్‌లున్నాయని నిరాశ చెందొద్దన్నారు. కష్టపడి పనిచేయాలని, ఆటపై దృష్టి పెట్టాలని నాలో స్థైర్యాన్ని నింపారు’ అని చెప్పుకొచ్చారు.
TG: మహాలక్ష్మి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్త్రీలే ఉంటున్నారు. DEC 9 నుంచి ఈ నెల 19 వరకు 122 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 79 కోట్ల మంది(64.47%) మహాలక్ష్ములే. హనుమకొండ సిటీ బస్సుల్లో ఏకంగా 82% మంది మహిళలే ఉన్నారు. రీజియన్ల వారీగా చూస్తే GHMC(67.45%) తొలి స్థానంలో ఉండగా, తర్వాత కరీంనగర్(67.37%), నిజామాబాద్(65.17%), మెదక్(64.67%) ఉన్నాయి.
TG: ఆర్టీసీలో తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీకి CM రేవంత్ ఆమోదం తెలిపారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాబోయే 2-3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని మరిన్ని పోస్టులు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు RTC విలీన ప్రక్రియపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందన్నారు. ఏడాదిన్నరలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన దేశవ్యాప్తంగా వ్యాపారం పుంజుకుందని, లావాదేవీల విలువ రూ.25వేల కోట్లు దాటేసిందని కాయిట్ తెలిపింది. పూలు, పండ్లు, మిఠాయిలు, వస్త్రాలు, అలంకరణ సామగ్రి, పాలు, పెరుగు, వెన్న, ఎండుఫలాల కోసం ప్రజలు బాగా ఖర్చు చేశారని పేర్కొంది. సనాతన ఎకానమీలో జన్మాష్టమి కీలకమైందని కాయిట్ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ అన్నారు. రాఖీపౌర్ణమి నాడు రూ.12000 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు.
AP: రాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయ దస్త్రాల దగ్ధం కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ తేజను ప్రశ్నించారు.
గంజాయి ఆకుల్లోని టెట్రా హైడ్రో క్యానబినోల్(THC)అనే రసాయనంలో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ లక్షణాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. THCని అతి తక్కువ మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో వాడితే అది వృద్ధాప్యం వల్ల మెదడులో వచ్చే మార్పులను రివర్స్ చేస్తుందని తేలింది. జర్మనీ, ఇజ్రాయెల్ సైంటిస్టులు ఎలుకల మెదళ్లపై అధ్యయనం చేయగా సానుకూల ఫలితాలు వచ్చాయి.
*NOTE: గంజాయి వ్యసనం ఆరోగ్యానికి హానికరం.
యాపిల్ కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి కెవన్ పారేఖ్ ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలసిస్ VPగా పనిచేస్తున్న ఆయన 2025, జనవరి 1న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక వ్యూహాల్లో 11 ఏళ్లుగా ఆయన కీలకంగా ఉన్నారు. కంపెనీ వరల్డ్ వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. ‘కెవన్ తెలివైనవారు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. CFOగా పర్‌ఫెక్ట్ ఛాయిస్’ అని CEO కుక్ ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవిత సుమారు 6 నెలలుగా తిహార్ జైలులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ ఆమెకు బెయిల్ ఇవ్వని కోర్టు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. ఇవాళ మరోసారి ఆమె బెయిల్ పిటిషన్ సుప్రీంలో విచారణకు రానుంది. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈసారి కేటీఆర్, హరీశ్ రావు, గంగుల తదితర నేతలు భారీగా ఢిల్లీకి వెళ్లారు. ఇటు కవిత బయటికొస్తున్నారంటూ BRS శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి.
AP: మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే CM చంద్రబాబు, Dy.CM పవన్‌కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.
బుచ్చిబాబు టోర్నీలో భాగంగా ఇవాళ ఉ.9.30 గంటలకు ప్రారంభం కానున్న గ్రూప్-సి తొలి మ్యాచ్‌లో తమిళనాడు CA ఎలెవన్‌తో ముంబై తలపడనుంది. ముంబై తరఫున సూర్యకుమార్, శ్రేయస్, సర్ఫరాజ్ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీకి ముందు సూర్యకిది వార్మప్‌గా ఉపయోగపడనుంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటిదాకా తన మార్క్ చూపించని శ్రేయస్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది. అంతర్జాతీయ సిరీస్‌లకు ఎంపిక కావడానికి సర్ఫరాజ్‌కు ఇది మంచి అవకాశం.
Sorry, no posts matched your criteria.