News November 24, 2024

అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!

image

యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.

News November 24, 2024

పంజాబ్‌ కింగ్స్‌పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

image

PBKS ఫ్రాంచైజీపై క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో ఆ జట్టులో మళ్లీ ఆడటం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. గౌతమ్ 2020లో పంజాబ్ తరఫున ఆడారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను. కానీ పంజాబ్‌కు అలా ఆడలేను. క్రికెట్‌పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం లేదు. క్రికెటర్‌గా నన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటానో అలా వారు వ్యవహరించలేదు’ అని స్పష్టం చేశారు.

News November 24, 2024

చిన్న డెస్క్‌లో పనిచేయిస్తున్నారంటూ రూ.38 కోట్ల దావా

image

తన ఎత్తు, బరువుకు సరిపోని డెస్క్‌లో బలవంతంగా పనిచేయిస్తున్నారంటూ న్యూయార్క్‌ పబ్లిక్ లైబ్రరీ ఉద్యోగి విలియం మార్టిన్ కోర్టులో రూ.38 కోట్లకు దావా వేశారు. ‘నా ఎత్తు 6.2 అడుగులు. బరువు 163 కేజీలు. నా డెస్క్ చాలా చిన్నగా ఉంది. దీనివల్ల నాకు శారీరక, మానసిక సమస్యలు తలెత్తాయి’ అని పేర్కొన్నారు. అయితే అతను ఆఫీసులో నిద్రపోతుండటంతో సస్పెండ్ చేశామని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది.

News November 24, 2024

కేఎల్ రాహుల్‌‌కు రూ.14 కోట్లు

image

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన ఇతడిని రూ.14కోట్లకు కొనుగోలు చేసింది. రాహుల్ కోసం ఢిల్లీ, CSK పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్లో రాహుల్‌కు 4683 రన్స్ ఉన్నాయి. గత సీజన్లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

News November 24, 2024

ఆ ప‌ని నేను చేయ‌ను: DY చంద్ర‌చూడ్‌

image

65 ఏళ్ల వయసులో త‌న ప‌ని ప‌ట్ల‌, న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్ల అనుమానాల్ని క‌లిగించే ఏ ప‌ని చేయ‌బోన‌ని Ex CJI DY చంద్ర‌చూడ్ వ్యాఖ్యానించారు. NDTV స‌ద‌స్సులో రాజ‌కీయాల్లో చేరిక‌పై ప్ర‌శ్నించగా చంద్ర‌చూడ్ ఈ విధంగా స్పందించారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినా, సమాజం వారిని న్యాయమూర్తిగానే చూస్తుందన్నారు. ఇత‌రుల‌ను అంగీక‌రించినట్టు(రాజ‌కీయాల్లో చేర‌డం), జ‌డ్జిల చేరిక‌ను స‌మాజం అంగీక‌రించ‌బోదన్నారు.

News November 24, 2024

ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌కు రూ.8.75కోట్లు

image

ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ రూ.8.45కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. ఆల్‌రౌండర్ కావడంతో పలు జట్లు ఇతడిని తీసుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. చెన్నై, బెంగళూరు మధ్య పోటీ నెలకొనగా చివరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

News November 24, 2024

మహ్మద్ సిరాజ్‌కు రూ.12.25కోట్లు

image

పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతను, చాలా సీజన్లుగా బెంగళూరు తరఫున ఆడుతున్నారు. సిరాజ్ ఐపీఎల్ కెరీర్లో 93 వికెట్లు తీశారు. బెస్ట్ 4-21.

News November 24, 2024

చాహల్‌కు రూ.18 కోట్లు

image

IPL మెగా వేలంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ అదరగొట్టారు. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇతను బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చారు. గత సీజన్లో ఇతను రాజస్థాన్ రాయల్స్ తరఫున కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

News November 24, 2024

‘ప్రభాస్-హను’ కోసం జైలు సెట్

image

ప్రభాస్‌తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఫిల్మ్ సిటీలో జైలు సెట్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సెట్‌పై అలీపోర్ జైలు, 1906 అని రాసి ఉంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా చేస్తున్నట్లు సమాచారం. ఆయన సరసన డాన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News November 24, 2024

గవర్నర్‌ను కలిసిన హేమంత్.. 28న ప్రమాణస్వీకారం

image

న‌వంబ‌ర్ 28న ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రిగా హేమంత్ సోరెన్‌ ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం గ‌వ‌ర్న‌ర్‌ సంతోష్ గంగ్వార్‌ను క‌లిసిన హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం ఆధ్వ‌ర్యంలోని ఇండియా కూట‌మి 56 స్థానాల్లో విజ‌యం సాధించడం తెలిసిందే. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI(ML)L 2, ఎన్డీయే 24 స్థానాల్లో గెలుపొందాయి.