India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ వేలంలో అదరగొట్టారు. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ఢిల్లీ, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అయ్యర్ 2024 సీజన్లో KKRను విజేతగా నిలిపారు. కాగా, ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ గతేడాది రూ.24.75 కోట్లు పలికారు.

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని <<14695790>>డిమాండ్ చేసిన<<>> మాజీ సీఎం జగన్‌పై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘నా నెత్తిన మీరు పెట్టిన బకాయిలు రూ.6,500 కోట్లు. విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్‌బాల్ ఆడుకున్న మీరు ఇప్పుడు సుద్దపూసనని చెప్పడం విచిత్రంగా ఉంది. ఇకపై రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకే చెల్లించేలా ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.

ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 ఐపీఎల్‌లో ఇతను పంజాబ్ తరఫున ఆడారు. రబాడా బేస్ ప్రైజ్ రూ.2కోట్లు కాగా, ఇతనిపై రూ.8.75కోట్లు అదనంగా వెచ్చించారు. పవర్ ప్లేలో రబాడా ఎఫెక్టివ్ బౌలర్.

భారత స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ తిరిగి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ.18 కోట్లకు RTM పద్ధతిలో పంజాబ్ కొనుగోలు చేసింది. ఇతడి కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, SRH పోటీ పడ్డాయి. గతంలో ఇతడు పంజాబ్ కింగ్స్ తరఫునే ఆడారు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం సింగ్ స్పెషాలిటీ.

సౌదీలోని జెడ్డాలో IPL వేలం ప్రారంభమైంది. తమ అభిమాన క్రికెటర్ ఏ టీమ్‌లోకి వెళతాడు? ఎన్ని రూ.కోట్లు కొల్లగొడతాడు? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఆక్షన్‌లో మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. StarSports ఛానల్, JioCinemaలో LIVE ప్రారంభమైంది. రేపు కూడా వేలం కొనసాగనుంది.

AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 487/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

AP: విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన సంస్థల గురించి పార్లమెంట్‌లో చర్చించాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం మాట్లాడుతూ ‘పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ గురించి వెల్లడించాలని కోరాం. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, నగరాల్లో వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ప్రస్తావించాం’ అని పేర్కొన్నారు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ ఫొటోలు తొలిసారిగా బయటకు వచ్చాయి. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్‌కు అనుష్క తనతో పాటు అకాయ్‌ను పెర్త్ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అకాయ్ అచ్చం కోహ్లీలాగే ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టెస్టులో విరాట్ (100*) సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

కాసేపట్లో IPL మెగా వేలం ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు భారీ ధరే పలికే అవకాశం ఉందని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వారిలో అంగ్రిశ్ రఘువంశీ, వైభవ్ అరోరా, అశుతోశ్ శర్మ, రసిఖ్ సలామ్ దార్, అభినవ్ మనోహర్ ఉన్నారు. వీరిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఐదుగురిలో మీ ఫేవరెట్ ఎవరు? వారికి ఎంత దక్కే అవకాశం ఉందనుకుంటున్నారు?
Sorry, no posts matched your criteria.