India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
DMK అంతర్గత పరిస్థితి పైకి చూస్తున్నంత సాఫీగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీని పట్టుకొని వేలాడుతున్నాడంటూ ఏడుసార్లు ఎమ్మెల్యే, ఆరుసార్లు మంత్రి దురైమురుగన్‌పై నటుడు రజనీకాంత్ వ్యాఖ్యల్నే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కుమారుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న స్టాలిన్ కల సాకారం కాకపోవడానికి ఆయనే కారణమని సమాచారం. పైగా DyCM పదవిని ఎవరు కాదనుకుంటారని మురుగన్ మనసులో మాటను బయటపెట్టేశారు.
HYDలో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం. నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8712665785కు కాల్ చేయాలన్నారు.
SHARE IT
శ్రీసింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మత్తు వదలరా’. 2019లో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ కామెడీ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా-2’ను రూపొందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలోకి రానున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందించారు.
TG: గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై CM రేవంత్ స్పందించారు. ‘గత పదేళ్లుగా ప్రభుత్వం పరీక్షలు పెట్టడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరుద్యోగులు ధర్నాలు చేశారు. ఇప్పుడేమో కొంతమంది వాళ్లను భయపెట్టి పరీక్షలు వద్దు వాయిదా వేయమని ధర్నాలు చేయిస్తున్నారు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న మీరు ఆలోచన చేయాలి. పదేళ్లుగా ప్రిపేర్ అవుతున్నాం కదా! మీకేమైనా సమస్యలుంటే మాకు చెప్పండి’ అని CM అన్నారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు రవిచంద్ర, సురేశ్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ఆమెకు బెయిల్ వస్తుందని BRS ఆశాభావంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు.
TG: రాష్ట్రంలోని నిరుద్యోగులకు CM రేవంత్ శుభవార్త చెప్పారు. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు తాను అన్నగా తోడుంటానని హామీ ఇచ్చారు. సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే మరోసారి ఆర్థిక సాయం చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులకే ఇబ్బందని, కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని రేవంత్ ఆరోపించారు.
చిన్నారులు, మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనలపై విచారణ జరపడానికి బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంజూరు చేస్తే అందులో 6 పోక్సో కోర్టులు మాత్రమే పనిచేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇటీవల ప్రధానికి CM మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవీ ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.
2024-25 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.1% వృద్ధి చెందుతుందని SBI రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. వాస్తవ వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ సరకు రవాణా, కంటైనర్ ఖర్చుల పెరుగుదల, సెమీకండక్టర్ల కొరత వంటి సప్లై చైన్ ఒత్తిళ్ల ఉన్నా ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని SBI రీసెర్చ్ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.
TG: నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని CM రేవంత్ అన్నారు. 90రోజుల్లోనే 30వేల మందికి నియామకపత్రాలు అందించామని చెప్పారు. సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ‘సివిల్స్ అభ్యర్థులు వివిధ రాష్ట్రాలకు, ఈ దేశానికి సేవలందిస్తే తెలంగాణ ప్రతిష్ఠ పెరుగుతుంది’ అని సీఎం అన్నారు.
‘కన్నప్ప’ సినిమాతో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కన్నప్ప చిన్ననాటి పాత్ర(తిన్నడు)లో అతను నటిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. కృష్ణాష్టమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Sorry, no posts matched your criteria.