India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పంజాబ్‌లో ఉపఎన్నికలు జరిగిన 4 అసెంబ్లీ సీట్లలో ఆప్ 3 చోట్ల విజయం సాధించి రాష్ట్రంలో పట్టునిలుపుకుంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా నలుగురు రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. డేరా బాబా నానక్, చబ్బేవాల్, గిద్దర్‌బాహా స్థానాల్లో ఆప్, బర్నాలాలో కాంగ్రెస్ గెలిచాయి. దీంతో ఆప్ బలం అసెంబ్లీలో 94కు చేరగా, కాంగ్రెస్ బలం 18 నుంచి 16కి తగ్గింది. ప్రజలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.

తానే చనిపోయే పరిస్థితి వస్తే.. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దంపతులను, ప్రతినిధుల సభ స్పీకర్‌ను హత్య చేయించనున్నట్లు ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డుటెర్టే సంచలన ప్రకటన చేశారు. అందుకోసం ఓ కిల్లర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022లో ఎన్నికలు గెలిచిన సారా, ఫెర్డినాండ్, ఆ తర్వాత బద్ధశత్రువులుగా మారారు. అధ్యక్షుడు తనను చంపించేందుకు చూస్తున్నారనేది సారా ఆరోపణ.

రేపు, ఎల్లుండి క్రికెట్ అభిమానులకు పండగే. సౌదీలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఆది, సోమవారాల్లో మ.3.30 గంటలకు ఆక్షన్ ప్రారంభం కానుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు IND vs AUS టెస్టు ఎంజాయ్ చేసి తర్వాత వేలం చూడొచ్చు. మొత్తం 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. StarSports ఛానల్, JioCinemaలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరి ఏ ఆటగాడు అత్యధిక ధర పలుకుతాడో కామెంట్ చేయండి.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఈరోజు పంజాబ్vబెంగాల్ మ్యాచ్‌లో బెంగాల్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ అద్భుత ప్రదర్శన చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 179 రన్స్ చేయగా ఛేజింగ్‌లో బెంగాల్ 10 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్, 49 బంతుల్లో సెంచరీ చేసి బెంగాల్‌ను విజయ తీరాలకు చేర్చారు. గత ఏడాది IPLలో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో 16 సీట్లలో పోటీ చేసిన MIMకు షాక్ తగిలింది. ఔరంగాబాద్ (ఈస్ట్)లో ఎంఐఎం అభ్యర్థి, మాజీ NDTV రిపోర్టర్ ఇంతియాజ్ జలీల్ కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి అతుల్ సావే విజయం సాధించారు. మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో MIM అభ్యర్థి 75 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ ఫలితంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా 2019లో MHలో ఎంఐఎం రెండు చోట్ల గెలిచింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్‌నాథ్ శిండే ఏకంగా 1,20,717 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 1,59,060 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేదార్ ప్రకాశ్(శివసేన-UBT) కేవలం 38,343 ఓట్లు సాధించారు. 2009 నుంచి షిండే వరుసగా గెలవడమే కాకుండా మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో 32,776, 2014లో 51,869, 2019లో 89,300 ఓట్ల మెజార్టీని సాధించారు.

TG: తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్ పాసై, 17-21 ఏళ్ల వయసు ఉండాలని సూచించారు. సందేహాలు ఉంటే 040-27740059కు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.

TG: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు(M) కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యతో CMకు సంబంధం లేదని MP మల్లు రవి తెలిపారు. గ్రామంలో గ్రామస్థుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆసుపత్రి నిర్మించారని, మాజీ సర్పంచ్ ఇంటికి దారి కూడా వదిలేశారన్నారు. దారి లేనట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని, KTR సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఆపాలన్నారు.

ఝార్ఖండ్‌లో రెండోసారి పూర్తి మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన JMM+ ఆ రాష్ట్రంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ప్రతి ఎలక్షన్‌లో బొటాబొటీ మెజార్టీతో BJP, JMM అధికారాన్ని మార్చుకుంటున్నాయి. అయితే ఈసారి ఆ సంప్రదాయాన్ని JMM బ్రేక్ చేసింది. అలాగే వరుసగా రెండుసార్లు(రాష్ట్రపతి పాలన లేకుండా) సీఎం పదవి చేపట్టిన నేతగా హేమంత్ సోరెన్ నిలవనున్నారు.

మహాయుతి కూటమి విజయం గౌతమ్ అదానీకి పెద్ద ఊరట అనే చెప్పాలి. ముంబైలో ఆయన తలపెట్టిన 3 బిలియన్ డాలర్ల ధారావీ అభివృద్ధి ప్రాజెక్టుకు మరో ఐదేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పేదల భూముల్ని అదానీకి దోచిపెడుతున్నారంటూ ఆరోపించిన మహా వికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. మహాయుతి గెలుపుతో అదానీకి అడ్డంకులు తొలగినట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.