India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలో పరాభవం శివసేన UBT, NCP SPకి ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు 5-6 సీట్లతో దూరమైన పార్టీలే ప్రాభవం కోల్పోతున్నాయి. ఆర్థిక వనరుల్లేక చతికిలపడుతున్నాయి. అలాంటిది విడిపోయి బలహీనపడిన పై పార్టీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యూహరచన, పార్టీని నడపడంలో అనుభవం లేదు. సీనియర్ శరద్ పవార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భవితవ్యం బోధపడటం లేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు SP చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు పరాభవాన్ని మిగిల్చాయి. బీజేపీ, దాని మిత్రపక్షం RLD 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గతంలో అఖిలేశ్ రాజీనామా చేసిన కర్హల్ స్థానంతోపాటు, సిసామౌలో ఎస్పీ లీడింగ్‌లో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాల్లో సొంతంగా గెలిచి జోరుమీదున్న SPకి ఈ ఫలితాలతో బీజేపీ బ్రేకులు వేసినట్టైంది.

పాలక్కడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు దిశగా పయనించిన బీజేపీ అభ్యర్థి కృష్ణకుమార్ తదుపరి రౌండ్లలో వెనుకబడ్డారు. ఇక్కడ యూడీఎఫ్ అభ్యర్థి రాహుల్ 18,724 ఓట్ల ముందంజలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో త్రిసూర్ లోక్‌సభ స్థానంలో విజయం సాధించి కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ తాజాగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్న ఆశలు సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. చెలక్కరలో బీజేపీ మూడో స్థానంలో ఉంది.

ఝార్ఖండ్‌లో ఇండియా కూటమికి పట్టం కట్టిన ప్రజలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. పోస్ట్ రిజల్ట్స్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన ఆయన రాంచీలో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పదవులు, పంపకాలు ముఖ్యం కాదన్నారు. తమ ఎమ్మెల్యేలు కమిట్‌మెంట్ కలిగినవారని, బీజేపీ లాక్కొనే ప్రయత్నం చేసినా వెళ్లబోరని భట్టి ధీమా వ్యక్తం చేశారు.

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 4,03,966 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. తర్వాతి స్థానాల్లో CPI, BJP ఉన్నాయి. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ MPగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో తాజాగా ప్రియాంక గెలిచారు.

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ MSNBCని కొనుగోలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. MSNBC అమ్మకానికి ఉందన్న ఓ పోస్టుకు జూనియర్ ట్రంప్ స్పందిస్తూ మస్క్‌ను అడిగారు. దీనిని ఎంతకు అమ్ముతున్నారంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ప్రముఖ పాడ్‌కాస్టర్ జో రోగన్ కూడా ఇది ఓకే అయితే తాను ఓ షో చేస్తానని చెప్పడంతో దీనిని తప్పకుండా చేయాలంటూ జూ.ట్రంప్ చెప్పడంతో డీల్ డన్ అంటూ మస్క్ హామీ ఇచ్చారు.

AP: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. JMM-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారం చేపట్టడానికి అవసరమైన 41 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. ప్రస్తుతం 51 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే ఈనెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఝార్ఖండ్‌లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలూ NDAకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

రెండు పార్లమెంటు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో BJP, కాంగ్రెస్ చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ 3,42,610 ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో BJP అభ్యర్థి డాక్టర్ శాంతుక్రావు మరోట్రావ్ హంబర్డే 12,283 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

AP: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్‌నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇవాళ సాయంత్రానికి నిర్ణయిస్తారు. శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ సీఎం రేసులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.