India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ ఈసీ సస్పెండ్ చేసిన పలువురు డీఎస్పీల స్థానంలో కొత్తవారిని సీఈవో నియమించారు. నరసరావుపేట- సుధాకర్‌రావు, గురజాల- శ్రీనివాసరావు, తాడిపత్రి- జనార్ధన్ నాయుడు, తిరుపతి- రవి మనోహరాచారి, తిరుపతి సీఐ- నాగేంద్రప్రసాద్.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణానికి తాము కారణమంటూ వస్తున్న వదంతులను ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లకు రైసీ సహాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే స్వతంత్ర పాలస్తీనా పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.
లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో మధ్యాహ్నం 1గంటలకు పోలింగ్ శాతం 36.72గా నమోదైంది. లద్దాఖ్‌లో గరిష్ఠంగా 52.02% పోలింగ్ నమోదు కాగా కనిష్ఠంగా మహారాష్ట్రలో 27.78% పోలింగ్ రికార్డ్ అయింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో బారాముల్లా నియోజకవర్గంలో ఈసారి రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదవుతోంది. 1 గంటకు ఇక్కడ 34.79% పోలింగ్ నమోదైంది. కాగా గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం 34.89కే పరిమితం అయింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. మార్చి 26 నుంచి ఆమె కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసిందే.
TG: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన గురించి ఆరునెలల్లోనే ప్రజలకు అర్థమైందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, తమ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి కేవలం 3 మెడికల్ కాలేజీలే వస్తే తాము పదేళ్లలో 33 ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు.
మనిషి జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌తో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.
పుణేలో ఓ మైనర్ బాలుడు(17) ఖరీదైన స్పోర్ట్స్ కార్‌ను నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేయడంతో బైక్‌పై వెళ్తోన్న దంపతులు మరణించారు. అతడిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు పలు కండీషన్లతో బెయిల్ ఇచ్చింది. ‘ప్రమాదం జరిగిన తీరుపై కచ్చితంగా వ్యాసం రాయాలి. ట్రాఫిక్ పోలీసులతో కలిసి 15 రోజులు పనిచేయాలి. మానసిక చికిత్స తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రమాద బాధితులకు సాయం చేయాలి’ అని స్పష్టం చేసింది.
TG: ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ కోసం చేప మందు పంపిణీ చేస్తున్నట్లు బత్తిన కుటుంబ సభ్యులు వెల్లడించారు. జూన్ 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉచితంగా ప్రసాదం అందిస్తామన్నారు. చేప ప్రసాదానికి వచ్చే వారికోసం వివిధ ఫౌండేషన్ల సహకారంతో 24 గంటల పాటు మెడికల్ సర్వీసు కల్పిస్తున్నట్లు తెలిపారు.
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్ తే బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ హయాంలో ఈయన గత నాలుగేళ్లు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా లై చింగ్ చైనాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పరిరక్షణలో తైవాన్ వెనకడుగు వేయదని.. చైనా తన బెదిరింపులను మానుకోవాలన్నారు.
AP: భావితరాల భవిష్యత్ అంతా విద్యపైనే ఆధారపడి ఉంటుందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదన్నారు. విజ్ఞానాన్ని పెంచుకోవడమే విద్య ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా మూలాలు మర్చిపోవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.