News August 25, 2024

చరిత్ర సృష్టించిన స్త్రీ-2 మూవీ

image

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన స్త్రీ-2 సినిమా బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. రిలీజైన తర్వాత రెండో శనివారం అత్యధిక కలెక్షన్లు(₹33.80cr) సాధించిన చిత్రంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో యానిమల్(₹32.47cr), గదర్-2(₹31.07cr), జవాన్(₹30.10cr), బాహుబలి-2(₹26.50cr), కశ్మీర్ ఫైల్స్(₹24.80cr), పఠాన్(₹22.50cr) ఉన్నాయి. మొత్తంగా స్త్రీ-2 మూవీ 10 రోజుల్లో ₹360crను కొల్లగొట్టింది.

Similar News

News September 18, 2024

ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. ఎప్పుడంటే?

image

ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

News September 18, 2024

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా ఆన్‌లైన్ టికెట్లను TTD రిలీజ్ చేసింది. ఈ నెల 20న ఉ.10 గంటల వరకు నమోదుకు అవకాశమిచ్చింది. 21న మ.3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23న ఉ.10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటలకు వసతి కోటా విడుదల చేయనున్నారు.

News September 18, 2024

ఒత్తిడి భరించలేక యువ సీఏ ఆత్మహత్య

image

పని ఒత్తిడి భరించలేక యువ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకుంది. పుణే (MH)కు చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది మార్చిలో ‘Ernst and Young’ కంపెనీలో జాయిన్ అయింది. ఎక్కువ పని గంటలతో కుంగిపోయిందని, తినేందుకు, నిద్రపోయేందుకూ సరైన సమయం లేక జులై 20న ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లి పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియలకు ఆ కంపెనీ నుంచి ఒక్కరూ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.