India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపులో NDA కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. విపక్ష MVAను వెనక్కి నెట్టేసింది. మ్యాజిక్ ఫిగర్ 145ను దాటేసింది. ప్రస్తుతం 149 స్థానాల్లో జోరు చూపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూటమీ 97 స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇంకా లెక్కింపు జరుగుతుండటంతో ఆధిక్యాలు మారే అవకాశం ఉంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం మహాయుతి ఆధిక్యత కనబరుస్తోంది. కాగా ఇందులోని అన్ని పార్టీల సారథులూ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. శివసేన (శిండే వర్గం) చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే మరోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. అయితే ఆయన కింగ్ మేకర్ అనేలా మారుతారా? మరోసారి BJP ఈ ఛాన్స్ ఇస్తుందా?. ఇక ఈ పదవిని ఆశిస్తున్న NCP (అజిత్ వర్గం) సారథి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా వెనకబడ్డారు.

ఝార్ఖండ్ ఓట్ల లెక్కింపులో NDA దూకుడు కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేసింది. ప్రస్తుతం 42 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు ఇండియా కూటమీ తగ్గేదే లే అంటోంది. 37 సీట్లలో ముందంజలో కొనసాగుతోంది. ఇంకా ఒకట్రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపే జరగడంతో ఆధిక్యాలు మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పోటీని చూస్తుంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే.

మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఔరంగాబాద్‌లోని ఈస్ట్ నియోజకవర్గంలో MIM లీడ్‌లోకి వచ్చింది. అక్కడ మజ్లిస్ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ స్థానంలో BJP నుంచి అతుల్ మోరేశ్వర్ సావే, కాంగ్రెస్ నుంచి లహు హన్మంతరావు శేవాలే పోటీలో ఉన్నారు.

వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంకా గాంధీ దూసుకెళ్తున్నారు. తన ప్రత్యర్థిపై 52 వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ బీజేపీ తరఫున నవ్యా హరిదాస్ బరిలో ఉన్నారు.

కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో బైపోల్స్‌లో మిశ్రమ ఫలితాలు కన్పిస్తున్నాయి. వయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక చెలక్కరలో CPM క్యాండిడేట్ ప్రదీప్ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్‌పై
పాలక్కాడ్‌లో BJP అభ్యర్థి కృష్ణకుమార్ ఆధిక్యంలో ఉన్నారు.

ఝార్ఖండ్‌లో అధికార JMM ఆధిక్యంలోకి వచ్చింది. ఆ పార్టీ 38 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. BJP 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 81 అసెంబ్లీ సీట్లున్న ఝార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు అవసరం. కాగా బర్హత్‌లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో ఆయన భార్య కల్పన సోరెన్ లీడింగ్‌లో ఉన్నారు. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి సెరైకెల్లాలో చంపై సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ కూటమి మొత్తం 132 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ఝార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 33 సీట్లలో ఎన్డీయే కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె 24వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
Sorry, no posts matched your criteria.