News August 25, 2024

పాక్ ఓటమి.. బంగ్లాదేశ్‌కు చరిత్రాత్మక విజయం

image

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10వికెట్ల తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి విజయం. పాక్ గడ్డపై 10వికెట్ల తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగానూ BAN రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 448/6 రన్స్‌కు డిక్లేర్ ఇచ్చిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 146పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 565, రెండో ఇన్నింగ్స్‌లో 30రన్స్‌ చేసి బంగ్లా గెలిచింది.

Similar News

News September 19, 2024

పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్.. మేఘాకు కాంట్రాక్ట్

image

AP: పోలవరం ప్రాజెక్టులో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిన్న క్యాబినెట్ నిర్ణయించింది. మొత్తం 63,656 చ.మీ. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే ఏడాది సమయం పడుతుందని.. మేఘాకు ఇవ్వడం వల్ల ఈ నవంబర్ నుంచే పనులు ప్రారంభించవచ్చని మంత్రిమండలి అభిప్రాయపడింది.

News September 19, 2024

తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. రేపు ఆమోదం

image

TG: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. రేపు జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది పదో షెడ్యూల్‌లో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇదే పేరు కొనసాగింది. గడువు ముగియడంతో పేరు మార్చుతున్నారు.

News September 19, 2024

నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు.