India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాపీరైట్ కేసుల్లో అతిపెద్దదిగా గూగుల్, ఒరాకిల్ సంస్థల కేసును చెబుతుంటారు. ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసేందుకు గూగుల్ తమ 11వేల లైన్ల కోడ్‌ను కాపీ చేసిందని ఒరాకిల్ 9 బిలియన్ డాలర్లకు దావా వేసింది. దీనిని గూగుల్ సైతం న్యాయస్థానం ముందు ఒప్పుకొంది. ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో దశాబ్దంపాటు కొనసాగగా, న్యాయపోరాటంలో గూగుల్ గెలిచింది. ఒరాకిల్‌కు చెందిన Java APIని ఉపయోగించడం న్యాయమైనదేనని స్పష్టం చేసింది.

రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కి వ్యతిరేకంగా మరిన్ని సాక్ష్యాధారాలు పోలీసులకు లభించాయి. వాటి ఆధారంగా 1000 పేజీల అదనపు ఛార్జిషీట్‌ను వారు నమోదు చేశారు. కొత్తగా 20 వరకు సాక్ష్యాలు లభించినట్లు అందులో పేర్కొన్నారు. పునీత్ అనే సాక్షి మొబైల్ ఫోన్లో ఫొటోలు లభించినట్లు సమాచారం. ఆ ఫొటోలు హత్య జరిగిన చోట దర్శన్ ఉన్న సమయంలో తీసినవిగా తెలుస్తోంది.

మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైందని, రష్యా మిత్రదేశాలు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొనడమే నిదర్శనమని ఉక్రెయిన్ Ex సైన్యాధికారి వలెరీ జలుఝ్నీ అన్నారు. ఉత్తర కొరియా బలగాలు, ఇరాన్ ఆయుధాలను ప్రయోగించి అమాయకులను రష్యా హతమార్చడం 3వ ప్రపంచ యుద్ధానికి సాక్ష్యమన్నారు. నిర్ణయాత్మక చర్యల ద్వారా యుద్ధాన్ని ఇరు దేశాలకే పరిమితం చేయాలని ఉక్రెయిన్ మిత్రపక్షాలను వలెరీ కోరారు.

AP: PAC, పీయూసీ, అంచనాల కమిటీల ఎన్నిక కౌంటింగ్ పూర్తైంది. కమిటీ సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఎన్డీఏ MLAలు ఓట్లు వేయగా, ఎన్నికను వైసీపీ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.
☛ PAC కమిటీ సభ్యులు
1. నక్కా ఆనందబాబు, 2. ఆరిమిల్లి రాధాకృష్ణ, 3. అశోక్ రెడ్డి, 4. బూర్ల రామాంజనేయులు, 5. జయనాగేశ్వర్ రెడ్డి, 6. లలిత కుమారి, 7. శ్రీరామ్ రాజగోపాల్, 8. పులపర్తి రామాంజనేయులు, 9. విష్ణుకుమార్ రాజు.

☛ అంచనాల కమిటీ సభ్యులు
1. అఖిలప్రియ, 2. బండారు సత్యానందరావు, 3. వేగుళ్ల జోగేశ్వరరావు, 4. కందుల నారాయణరెడ్డి, 5. మద్దిపాటి వెంకటరాజు, 6. పార్థసారథి, 7. సునీల్ కుమార్, 8. ఏలూరి సాంబశివరావు, 9. నిమ్మక జయకృష్ణ
☛ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ
1. ఆనందరావు, 2. ఈశ్వర్ రావు, 3. గిడ్డి సత్యనారాయణ, 4. గౌతు శిరీష, 5. కూన రవికుమార్, 6. కుమార్ రాజా, 7. బేబీ నాయన, 8. తెనాలి శ్రావణ్, 9. వసంత కృష్ణ ప్రసాద్.

2022లో మహారాష్ట్ర రాజకీయాల్ని మలుపుతిప్పిన CM ఏక్‌నాథ్ శిండే ఈ సారి కింగ్ అవుతారా? కింగ్‌మేకర్ అవుతారా? అనే చర్చ మొదలైంది. మహాయుతి మెజారిటీ సీట్లు సాధించి, శిండే మళ్లీ CM కాకపోతే MHలో ఉద్ధవ్ తిరిగి బలపడతారని చెబుతున్నారు. పోటీ చేసిన 81 సీట్లలో ఎక్కువ చోట్ల గెలవాలంటున్నారు. లేదంటే BJPనే CM పదవిని అట్టిపెట్టుకుంటుందని పేర్కొంటున్నారు. MHలో రేపు కౌంటింగ్ జరగనుంది.

దేశవ్యాప్తంగా బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. ట్రంప్ రాకతో గోల్డ్ రేట్ 6% మేర తగ్గింది. ఇంకా తగ్గుతుందేమో అని కస్టమర్లు వేచిచూసే ధోరణి కనబరిచారు. తాజాగా ఉక్రెయిన్, రష్యా పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకోవడంతో NOV 19న రూ.73,739గా ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.76,559కి చేరుకుంది. వెడ్డింగ్ సీజన్ కావడం, రేటు మరింత పెరగొచ్చేమోనన్న భయంతో కస్టమర్లు నగలు కొంటున్నారని జువెలరీ సంఘం సభ్యులు చెప్తున్నారు.

ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీ నెట్‌వర్క్‌కు దక్కినట్లు తెలుస్తోంది. 2031 వరకు ఆ సంస్థ మ్యాచులను ప్రసారం చేస్తుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది నవంబర్ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచులను సోనీ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనపై వస్తున్న రూమర్స్ పట్ల కుమారుడు ఏఆర్ అమీన్ స్పందించారు. ‘నా తండ్రి లెజెండ్. ఆయన విలువలు పాటిస్తూ ఎనలేని గౌరవం, ప్రేమను సంపాదించారు. నా తండ్రిపై అసత్య, అర్థరహిత వార్తలు చూస్తే బాధేస్తోంది. తప్పుడు సమాచారం వ్యాప్తిని మానుకొని, ఆయన మనపై చూపిన ప్రభావం పట్ల గౌరవంగా ఉందాం’ అని పోస్ట్ చేశారు.

గోవాలో ఓ సబ్‌మెరైన్‌ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్‌మెరైన్‌కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.
Sorry, no posts matched your criteria.