India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశీయ స్టాక్ మార్కెట్‌లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. Sensex 1,961 పాయింట్ల లాభంతో 79,117 వద్ద, Nifty 557 పాయింట్ల భారీ లాభంతో 23,907 వద్ద స్థిరపడ్డాయి. IT స్టాక్స్ 3% మేర పెరగడం, బ్యాంక్ స్టాక్స్‌లో Value Buying, ఫైనాన్స్, ఆటో, మెటల్, ఫార్మా రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బెంచ్ మార్క్ సూచీలు Q2 ఫలితాల సీజన్ అనంతరం గరిష్ఠ లాభాలు ఆర్జించాయి. మీడియారంగ షేర్లు నష్టపోయాయి.

AP: ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం చంద్రబాబు 4.0ను చూస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలిస్తోంది. ఇక్కడ కూడా అదే రకమైన పాలన ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.

Febలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆప్ ప్రభుత్వ సేవలపై చర్చకు ‘రెవ్డీ పర్ చర్చా’ పేరుతో కొత్త కార్యక్రమంతోపాటు 6 గ్యారంటీలు అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఇస్తున్న ఉచిత విద్యుత్, నీరు, చదువు, వైద్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ప్రతి మహిళకు రూ.వెయ్యి, పెద్దవారికి తీర్థయాత్ర యోజన హామీలు ఇచ్చింది.

డిసెంబరులో అమరావతి పనులు ప్రారంభించి, 3ఏళ్లలో రాజధానికి ఓ రూపం తెస్తామని CM చంద్రబాబు అన్నారు. 6నెలల్లో MLA, MLC, ఆలిండియా ఆఫీసర్ల క్వార్టర్స్, గ్రూప్-డి, గ్రూప్-బి.. 9నెలల్లో గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు, NGO, ఆలిండియా సర్వీసెస్ భవనాలు పూర్తవుతాయని తెలిపారు. ‘డిసెంబర్ నుంచి గేర్ మారుస్తా. మీరూ నాతో పనిచేయాలి. అమరావతి పూర్తై ఉంటే ఏడాదికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లు వచ్చేవి’ అని అన్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 67/7 స్కోర్ చేసింది. కెప్టెన్ బుమ్రా 4 వికెట్లతో కంగారూలను బెంబేలెత్తించగా సిరాజ్ 2, రాణా 1 వికెట్ తీసి టెస్టుపై పట్టు బిగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 150 రన్స్ చేసి ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం 83 రన్స్ వెనుకబడి ఉంది.

AP: రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 10 రోజులపాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 59 గంటల 57 నిమిషాల పాటు సభ కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది.

అప్పట్లో ఓ హీరో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారని నటి ఖుష్బూ సుందర్ తెలిపారు. గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకల్లో ఆమె మాట్లాడారు. ‘కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా సెట్స్‌లో ఉన్నప్పుడు హీరో నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా చెప్పు సైజు 41. ఇక్కడే కొట్టాలా.. యూనిట్ అందరి ముందూ కొట్టాలా అని ఎదురుతిరిగా. అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు.

TG: మంత్రి <<14675277>>కొండా సురేఖ<<>> ఇంట్లో రేవ్ పార్టీ జరిగిందని జరుగుతోన్న ప్రచారంపై ఆమె కూతురు సుష్మితా పటేల్ స్పందించారు. తమ ఇంట్లో జరిగిందని రేవ్ పార్టీ కాదని, తన కూతురి పుట్టినరోజు వేడుక అని వెల్లడించారు. ఆ బర్త్ డే పార్టీలో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదన్నారు. సురేఖ తన స్టాఫ్‌ను ఇంట్లో వాళ్లుగానే చూసుకుంటారని, అందుకే వేడుకకు వాళ్లను ఆహ్వానించారని ఆమె చెప్పారు.

ఇంకా ఫలితాలే వెలువడలేదు. మహారాష్ట్రలో 2 కూటముల్లో CM కుర్చీ కోసం పోరు మొదలైంది! క్రితంసారి ఏక్‌నాథ్ శిండేకు అవకాశం ఇవ్వడంతో ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పదవి అప్పగించాలని BJP నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీఎంగా శిండేనే కొనసాగుతారని శివసేన నేతలు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రానప్పటికీ కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాతో ఉంది. సీఎం పదవి తమకే వస్తుందని కాంగ్రెస్, శివసేన UBT చెప్పుకుంటున్నాయి.

AP: స్కూళ్ల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని పలువురు MLAలు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అన్నారు. పైలట్ ప్రాజెక్టుగానే అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్‌కు తగ్గట్లు సమయం మార్చుతామని తెలిపారు. హైస్కూళ్లు ఉదయం 9- 4గంటల వరకు పని చేస్తుండగా, 5వరకు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని 2స్కూళ్లలో ఇది అమలు అవుతోంది.
Sorry, no posts matched your criteria.