India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా నెట్టింట ఫన్నీ పోస్టు పెట్టారు. ‘బీజేపీ గెలవాలంటే 272 సీట్లు కావాలని నా భార్యకు చెప్పా. ఆమె 20 ఓవర్లలోనా? అని అడిగారు. అంతా IPL ప్రభావం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి ‘బీజేపీ టార్గెట్ 400.. అది ఏడు రోజుల మ్యాచ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘మీ.. పోస్ట్ మేడం చదవకూడదని ఆశిస్తున్నా’ అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు.
ఇప్పటివరకు పట్టుకున్న ఎన్నికల నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇది ఎన్నికలు ముగిసే నాటికి మరింత పెరగొచ్చని అంచనా వేసింది. డ్రగ్స్, లిక్కర్ పట్టుకోవడంపై ఈ సారి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. 3 రోజుల్లో ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.
TG: ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో ఇవాళ జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి లోగా ఈసీ నుంచి అనుమతి రాకుంటే మంత్రులతో కలిసి ఆయన హస్తిన వెళ్లనున్నారు. కేబినెట్ భేటీ ప్రాధాన్యతపై కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటలపై కేబినెట్‌లో చర్చించేందుకు అనుమతి తీసుకోనున్నారు.
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటంతో గత 70ఏళ్లుగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన పాకిస్థాన్ ఇప్పుడు బిచ్చమెత్తుకునే స్థితికి చేరిందన్నారు ప్రధాని మోదీ. హాని తలపెట్టాలనుకునే శత్రు దేశాలు 100 సార్లు ఆలోచించుకోవాలన్నారు. ‘బలహీనమైన ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను మార్చగిలిగేదా? ఆర్టికల్ 370 గోడను బద్దలుకొట్టాం. జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు అభివృద్ధి మొదలైంది’ అని హరియాణా పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.
బెంగళూరు, చెన్నై మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 3 ఓవర్ల వద్ద చినుకులు పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్‌ను కప్పేశారు. 3 ఓవర్లకు ఆర్సీబీ 31 పరుగులు చేసింది. కాసేపట్లోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
TG: హైదరాబాద్‌లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ సాయంత్రం వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత ఇంద్రధనుస్సు ఏర్పడింది. అలా కొద్దిసేపటి వరకు ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. ఈ దృశ్యాలను పలువురు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
TG: తాను పార్టీ మారడం లేదని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల స్వభావం గురించి మాట్లాడితే కొందరు పార్టీ మార్పు ఊహించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా కొంతకాలంగా కాంగ్రెస్‌పై రాములమ్మ అసంతృప్తితో ఉన్నారని.. బీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది.
బోయింగ్ విమానాల నాణ్యత, భద్రత లోపాలపై సంచలన ఆరోపణలు చేసిన జాన్ బార్నెట్ ఆత్మహత్య వల్లే చనిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తుపాకీతో తలకు కాల్చుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 9న సౌత్ కరోలినాలో జాన్ మృతదేహాన్ని ఆయన వాహనంలో గుర్తించారు. బోయింగ్‌పై మండిపడుతూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా బోయింగ్ సిబ్బంది తనపై నిఘా ఉంచి వేధించారని గతంలో జాన్ ఆరోపించారు.
TG: హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలుత ఎమర్జెన్సీ సేవలకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్రి డ్రోన్స్‌తో వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.