India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. VZM, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, KNL, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు TGలోని ఉమ్మడి ADB, KNR, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నారాయణపేట, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రధాని నరేంద్రమోదీ రెండు దేశాల పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు. మొదట పోలాండ్‌కు వెళ్లిన మోదీ 45 ఏళ్లలో అక్కడ పర్యటించిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత రైలులో ఉక్రెయిన్‌కు వెళ్లి జెలెన్ స్కీని ఓదార్చారు. బాలల స్మారకాన్ని సందర్శించారు. మానవతా సాయం కింద వైద్య పరికరాలు అందించారు.
TG: వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లలో మెసేజ్‌లు, నోటిఫికేషన్లు చూసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఒక్క సెకన్ దృష్టిని మరల్చడం వల్ల ప్రమాదం జరిగి, జీవితాలు తలకిందులు అవ్వొచ్చని చెబుతున్నారు. లైఫ్ కంటే మెసేజ్‌లు/నోటిఫికేషన్లు విలువైనవి కావని అవగాహన కల్పిస్తూ ట్వీట్ చేశారు. ‘STAY ALIVE, DONT TEXT AND DRIVE’ అని పేర్కొన్నారు.
AP: ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 29 నుంచి రెండో యూనిట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 1 నుంచి 24 వరకు పూర్తి చేసిన సిలబస్ ప్రకారం ఈ పరీక్షలు నిర్వహించాలని బోర్డు ఆదేశించింది. ప్రైవేట్ కాలేజీలకు పరీక్షలు తప్పనిసరి కాదు.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు, కెరీర్ వృద్ధికి ఊతమిస్తూ వారు ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకోవడానికి UGC మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి-పరిశోధన ఆధారంగా వివిధ విభాగాలను విభజించింది. విద్యార్థులు తమ కెరీర్ ఆకాంక్షల మేరకు ఏదైనా విభాగాలను ఎంపిక చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. దేశంలోని 500 ప్రముఖ సంస్థల్లో విద్యార్థులు పెయిడ్ ఇంటర్న్‌షిప్ పొందే పథకాన్ని కేంద్రం బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది.
పన్ను చెల్లింపుదారులతో అధికారులు కఠినంగా ప్రవర్తించొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బదులుగా వారితో చక్కగా మాట్లాడి, బకాయిల గురించి వివరించాలన్నారు. అవసరమైతే మార్పులూ చేయాలని సూచించారు. సందేహాల దశలోనే సమస్యలను పరిష్కరిస్తే అవి గ్రీవెన్సెస్‌గా మారవన్నారు. పన్ను అధికారులు మొదట ఒక్కో రంగంలోని వ్యాపారులతో మాట్లాడి జీఎస్టీపై సందేహాలు తీర్చాలన్నారు. వారితో రిలేషన్ పెంచుకోవాలన్నారు.
మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులపై చర్యలు తీసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం విచారకరమని శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహిళలపై వేధింపులు, బద్లాపూర్‌లో చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్రలో మహిళల భద్రతకు భరోసా కల్పించాలంటే ‘మహాయుతి’ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు.
కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బీబర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. కొడుకు పాదాల ఫొటోను పంచుకుంటూ అతని పేరు జాక్ బ్లూస్ అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. జూనియర్ బీబర్ వచ్చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ‘బేబీ’ సాంగ్‌తో జస్టిన్ లక్షలాది మంది భారత అభిమానులను సొంతం చేసుకున్నారు.
AP: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి సుభాష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులను ఆయన వేధించారని, వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పారిశ్రామిక ప్రమాదాల్లో సిబ్బంది మరణించినప్పుడు CM హోదాలో జగన్ ఎప్పుడూ పరామర్శకు రాలేదని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కార్మికుల బాగోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి చనిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో జరిగింది. అతని శవాన్ని ఖననం చేసేందుకు బోరభేటి గ్రామస్థులు నిరాకరించారు. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించొద్దని తీర్మానించారు. నిన్న నిందితుడిని క్రైమ్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నేరం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.