News August 24, 2024

శస్త్రచికిత్స విజయవంతమైంది: రవితేజ

image

తనకు జరిగిన శస్త్రచికిత్సపై మాస్ మహారాజా రవితేజ అప్డేట్ ఇచ్చారు. ‘శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డిశ్ఛార్జ్ కూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలు, మద్దతుకు కృతజ్ఞతలు. మళ్లీ సెట్‌లోకి వెళ్లేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నా’ అని తెలిపారు. RT75 సినిమా చిత్రీకరణ సమయంలో రవితేజ కుడి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే.

News August 24, 2024

గ్రాడ్యుయేష‌న్ డేకి ఆ డ్రెస్ కోడ్ ఇక బంద్

image

వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేష‌న్ డేకి ఇక నుంచి న‌ల్ల‌టికోటు, టోపీ ధ‌రించే సంస్కృతికి స్వ‌స్తిప‌ల‌కాల‌ని కేంద్రం ఆదేశించింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఆస్ప‌త్రులు, ఎయిమ్స్‌, ఇత‌ర ప్ర‌ముఖ సంస్థ‌ల‌కు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. బ్రిటిష్ పాల‌న నుంచి ఈ విధానం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రాల్లోని స్థానిక సంప్రదాయాల ఆధారంగా డ్రెస్ కోడ్ రూపొందించాలని నిర్దేశించింది.

News August 24, 2024

సపోర్ట్ చేసిన MS ధోనీకి థాంక్స్: ధవన్

image

తాను ఫామ్‌లో లేనప్పుడు మద్దతుగా నిలిచిన అప్పటి కెప్టెన్ ధోనీకి ధవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధవన్‌కు మద్దతుగా ధోనీ నిలువగా ఆయన హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచారు. 2014, 2016 టీ20 వరల్డ్ కప్‌లలో ఆయనకు టీమ్-11లో చోటు దక్కలేదు. కానీ, 2015 ప్రపంచ కప్‌లో ఆయనకు ధోనీ ఛాన్స్ ఇవ్వడంతో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలోనూ శిఖర్ ఆడిన విషయం తెలిసిందే.

News August 24, 2024

N కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

image

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయడంపై అక్కినేని నాగార్జున స్పందించారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఇది పట్టా భూమి అని ఆయన తెలిపారు. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని, ప్రైవేట్ ల్యాండ్‌లోనే నిర్మించినట్లు స్పష్టం చేశారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

News August 24, 2024

పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుత ధర ఎంతంటే?

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.390 పెరిగి రూ.73,040కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.350 పెరిగి రూ.66,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,300 పెరిగి రూ.93వేలకు చేరింది.

News August 24, 2024

ప్రజల దృష్టిని మరల్చేందుకు హై’డ్రామా’: BRS

image

TG: రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ నాటకానికి తెరలేపారని BRS విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్‌లను కూల్చేస్తారా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్‌మెంట్ జరిపారని గుర్తు చేస్తున్నారు.

News August 24, 2024

శిఖర్ ధవన్ రికార్డులు

image

*అంతర్జాతీయ క్రికెట్లో 10867 రన్స్
*భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన 12వ <<13928600>>ప్లేయర్<<>>
*24 సెంచరీలు, 79 50+ స్కోర్స్
*2018 ఆసియా కప్‌లో అత్యధిక రన్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
*SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత ఓపెనర్
*ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక యావరేజ్

News August 24, 2024

20 ఏళ్ల తర్వాత ఒక్కటైన తండ్రీకొడుకులు!

image

తండ్రీకొడుకులు 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అమృత్‌సర్‌లో ఉండే సుఖ్‌పాల్ సింగ్ జపనీయురాలిని పెళ్లాడి కొడుకు పుట్టాక విడిపోయారు. సింగ్ మరో పెళ్లి చేసుకోగా కూతురు జన్మించింది. అయితే, తన తండ్రి ఎలా ఉంటారో చూడాలని 21 ఏళ్ల రిన్ తకహతా అమృత్‌సర్‌కు వచ్చారు. చాలా చోట్ల వెతకగా ఇంటి జాడ దొరికింది. కొడుకు రావడంతో తండ్రి ఎంతో సంతోషపడ్డారు. రక్షాబంధన్ రోజు రావడంతో సింగ్ కూతురు తన సోదరుడికి రాఖీ కట్టింది.

News August 24, 2024

ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ దావా

image

తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌ వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ అనుబంధ సంస్థ ట్రైజెట్టో దావా వేసింది. కాగ్నిజెంట్ డేటాబేస్‌ను ఇన్ఫోసిస్ అక్రమంగా యాక్సెస్ చేసి పోటీ సాఫ్ట్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని టెక్సస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఇన్ఫోసిస్ ఖండించింది. చట్ట ప్రకారం ఎదుర్కొంటామని తెలిపింది.

News August 24, 2024

బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు.. పల్లాపై కేసు

image

TG: BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఆరోపించారు. దీంతో పోచారం ఐటీ కారిడార్ PSలో కేసు నమోదైంది.