News August 24, 2024

ప్రశ్నాపత్రాలు లీకైతే కఠిన చర్యలు: నారా లోకేశ్

image

AP: ప్రశ్నాపత్రాలు లీకవ్వకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. మండలస్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. వచ్చే నెల 5న గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

News August 24, 2024

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 పోస్టుల భర్తీ

image

AP: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ భర్తీలను చేపట్టనున్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం https:/dme.ap.nic.in, https:/apmsrb.ap.gov.in/srb/ చూడాలని సూచించింది. ఆసక్తికలవారు వచ్చే నెల 9 లోపుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

News August 24, 2024

ఆ నలుగురికి మంత్రి పదవులు?

image

TG: అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్‌తో పాటు మరో ఇద్దరి పేర్లను రేవంత్ సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా 6 మంత్రి పదవులున్నప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి, కేకేకు కేబినేట్ హోదా ఇవ్వడంతో ఇక నాలుగు మంత్రి పదవుల్నే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News August 24, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రెండు డీఏలు విడుదల?

image

TG: ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో రెండింటిని మంజూరు చేయాలని భావిస్తోందని సమాచారం. ఈ చెల్లింపుల వివరాలను ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు ప్రతి 6 నెలలకోసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో 3, కాంగ్రెస్ వచ్చాక ఒక డీఏ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

News August 24, 2024

ఒక టిక్‌టాక్ వీడియోతో ఐస్‌లాండ్‌లో కీరదోస కొరత

image

సమాజాన్ని సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చేప్పే ఘటన ఇది. కీరదోస సలాడ్‌ షేక్‌ ఎలా చేసుకోవాలో చెబుతూ లోగాన్ మోఫిట్ అనే టిక్‌టాకర్ చేసిన పోస్ట్ ఐస్‌లాండ్‌లో వైరల్ అయింది. ఆ షేక్‌ను అక్కడి ప్రజలు వేలంవెర్రిగా ఇంట్లో చేసేందుకు యత్నించడంతో కీర దోసలన్నీ ఖాళీ అయిపోయి కొరత ఏర్పడిందని రిటెయిల్ అమ్మకాల సంస్థ క్రోనాన్ ప్రకటించింది.

News August 24, 2024

పెంపకంలో వైఫల్యానికి కోల్‌కతా ఘటన నిదర్శనం: జాన్ అబ్రహాం

image

అబ్బాయిల పెంపకంలో భారత్ వైఫల్యానికి కోల్‌కతా ఘటన ఓ నిదర్శనమని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఎలా ప్రవర్తించాలో అబ్బాయిలకు నేర్పించాలి. వినకపోతే చీల్చి చెండాడాలి. వారి మెరుగైన పెంపకం కోసం తల్లిదండ్రులే అన్ని విషయాలనూ నేర్పించాలి. ఈ ఘటనలో అమ్మాయిల తప్పేముంది? వారికి ఏం చెప్పనక్కర్లేదు. వారు మరింత ధైర్యంగా ముందుకెళ్లాలి’ అని స్పష్టం చేశారు.

News August 24, 2024

‘ఇంద్ర’ టీమ్‌కు ‘చిరు’ సత్కారం

image

ఇంద్ర రీరిలీజైన సందర్భంగా ఆ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా సన్మానించారు. ‘ఇంద్ర క్రియేట్ చేసిన సునామీని గుర్తు చేస్తూ 22 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజైన సందర్భంగా ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం! ప్రొడ్యూసర్ దత్‌గారు, డైరెక్టర్ గోపాల్, డైలాగ్స్‌ని అందించిన పరుచూరి బ్రదర్స్, కథ ఇచ్చిన చిన్నిక్రిష్ణ, సంగీత దర్శకుడు మణిశర్మతో మేకింగ్ గురించి ఆత్మీయ సంభాషణ’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

News August 24, 2024

జగన్.. ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది: చంద్రబాబు

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘జగన్.. హోదా, గౌరవం అనేవి నేరాలు, బెదిరింపులతో రావు. వాటిని ప్రజలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అందుకోసం కోర్టుకు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

News August 24, 2024

భారత్‌కంటే అఫ్గాన్ సురక్షితమేమో.. అర్షద్ ట్వీట్ వైరల్!

image

రెబల్‌స్టార్ ప్రభాస్‌పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీని సినీ అభిమానులు వదలడం లేదు. 2012లో ఆయన చేసిన ట్వీట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ‘రేపు ఉదయం అఫ్గాన్ అధ్యక్షుడిని మీట్ అవుతున్నా. నేను ఆ దేశానికి షిఫ్ట్ అయితే బెటరేమో. భారత్ కంటే అక్కడే సురక్షితం’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అర్జంట్‌గా అఫ్గాన్ షిఫ్ట్ అయిపో అంటూ నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు.

News August 24, 2024

రష్యాకు భారత్ మద్దతునివ్వకూడదు: జెలెన్‌స్కీ

image

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో భేటీ అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడారు. రష్యాకు భారత్ మద్దతునివ్వకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘భారత్ తటస్థ వైఖరి వీడి మావైపు రావాలి. రష్యా నుంచి చమురు సహా దిగుమతులన్నింటినీ ఆపేయాలి. భారత్, చైనా నుంచి వస్తున్న ఆదాయం రష్యాకు బలంగా మారుతోంది. పుతిన్‌ను అడ్డుకోవడం భారత్‌కు సాధ్యం’ అని వ్యాఖ్యానించారు.