News May 17, 2024

GROUP-4 అభ్యర్థులకు అలర్ట్

image

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో TSPSC ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేసింది. ఈక్రమంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తాజాగా అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 9న ర్యాంకుల లిస్టు రిలీజ్ చేయగా.. జనరల్ అభ్యర్థులను 1:3, PWD అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి లిస్టును వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. అభ్యర్థులు EWS, కులం, నాన్ క్రిమిలేయర్ & స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది.

News May 17, 2024

మహారాష్ట్రలో పొంగులేటి ఎన్నికల ప్రచారం

image

TG: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. ముంబై సౌత్ సెంట్రల్ మహా వికాస్ అఘాడీ ఎంపీ అభ్యర్థి అరవింద్ సావంత్ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ పరిధిలోని ధారావి, సియోన్ కొలివాడ తదితర ప్రాంతాల్లో ప్రజలను ఆయన ఓట్లు అభ్యర్థించారు. అక్కడి నేతలు పొంగులేటిని ఘనంగా సన్మానించారు.

News May 17, 2024

‘ఫ్రైడే’.. నో సినిమా డే!

image

శుక్రవారం వచ్చిందంటే చాలు ఏదో ఒక కొత్త సినిమా రిలీజవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యూట్యూబర్లు సైతం క్యూ కడుతుంటారు. సమ్మర్ హాలీడేస్‌లో మరింత కిటకిటలాడాల్సిన థియేటర్లు మూగబోయాయి. పెద్ద హీరోల సినిమా ఒకటీ లేకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదు. దీంతో కొందరు థియేటర్ యజమానులు కొన్నిరోజులు థియేటర్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు.

News May 17, 2024

రష్మిక వీడియోకు ప్రధాని మోదీ రిప్లై

image

ముంబైలో సముద్రంపై నిర్మించిన ‘అటల్ సేతు’ వంతెనపై ప్రశంసలు కురిపిస్తూ నటి రష్మిక మందన్న వీడియోను పోస్ట్ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజలను కనెక్ట్ చేయడం.. వారి జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది ఏముంటుంది’ అని ట్విటర్‌లో కామెంట్ చేశారు. ‘అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్లలో సుసాధ్యం చేశారు. వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోంది’ అంటూ రష్మిక ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

News May 17, 2024

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా?

image

పెళ్లైన మహిళలు 50 తులాలు, పెళ్లి కాని మహిళలు 25 తులాలు, మగవారు 10 తులాల బంగారాన్ని నగల రూపంలో ఇంట్లో ఉంచుకోవచ్చు. 1994 CBDT సర్క్యులర్ ప్రకారం ఈ పరిమితికి లోబడి ఉన్న బంగారం జోలికి IT అధికారులు రారు. పరిమితికి మించి ఉన్నా, వారసత్వంగా పెద్ద మొత్తంలో ఆభరణాలు వచ్చినా వాటికి సాక్ష్యాలు చూపించాలి. లేదంటే జప్తు చేస్తారు. కాగా బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉన్న గోల్డ్ గురించి ఈ సర్క్యులర్‌లో ప్రస్తావించలేదు.

News May 17, 2024

పోలీసులు చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: లేళ్ల అప్పిరెడ్డి

image

AP: వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం ఆయనకు ఇష్టం లేదన్నారు. టీడీపీ అధినేత అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై వేటు పడిందని, ఆయన ట్రాప్‌లో పడి పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలగొట్టడం దారుణమన్నారు.

News May 17, 2024

నాలుగో విడతలో 69.16 శాతం పోలింగ్‌

image

ఈ నెల 13న జరిగిన నాలుగో విడత ఎన్నికల తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. 69.16 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపింది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, యూటీల్లోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. 69.58 శాతం పురుషులు, 68.73 శాతం మహిళలు, 34.23 శాతం ట్రాన్స్‌జెండర్లు ఓటు వేశారు.

News May 17, 2024

SSMB29పై నిర్మాణ సంస్థ కీలక ప్రకటన

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB29 కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందంటూ వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ ఖండించింది. ‘కొన్ని ఇంగ్లిష్ వెబ్‌సైట్స్‌లో ఇలాంటి కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాలో కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి భాగమైనట్లు రాస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. ఈ చిత్ర అప్డేట్లను మేమే ఇస్తాం. ఇతరుల ప్రకటనలను నమ్మొద్దు’ అని ఓ నోట్ విడుదల చేసింది.

News May 17, 2024

ఫ్రీ బస్‌పై మోదీ విమర్శలకు కేజ్రీవాల్ కౌంటర్!

image

మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయడంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘ఢిల్లీలో అమలవుతున్న ఈ స్కీమ్‌ను మోదీ వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫ్రీ బస్ స్కీమ్ కావాలని మహిళలు కోరుకుంటున్నారు. కానీ మోదీ దానిని అంతం చేయాలని అనుకుంటున్నారు. ప్రధాని, ఆయన మంత్రులు ఫ్రీగా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు బస్సులో ఉచితంగా ఎందుకు తిరగొద్దు?’ అని ప్రశ్నించారు.

News May 17, 2024

ఏసీలకు ఫుల్ డిమాండ్.. రూ.1,500 కోట్లు నష్టపోయిన కంపెనీలు

image

ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ACలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే వినియోగదారుల అవసరాలను తీర్చడంలో వోల్టాస్, డైకిన్, బ్లూస్టార్ లాంటి సంస్థలు విఫలమయ్యాయి. 4-5 లక్షల ACల షార్టేజ్ ఏర్పడటంతో ₹1,200-₹1,500 కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా. ప్రభుత్వ నిబంధనల కారణంగా తాము గ్యాస్‌ ఫిల్డ్ ఏసీలను ఇంపోర్ట్ చేసుకోలేకపోయామని, అలాగే BIS మార్క్ కాపర్ పరికరాల కొరత ఏర్పడిందని కంపెనీలు చెబుతున్నాయి.