News May 17, 2024

బిభవ్ కుమార్‌కు మహిళా కమిషన్ నోటీసులు

image

ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈనెల 18న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే అధికారులు ఆయన ఇంటికి వెళ్తే నోటీసులు తీసుకోవడానికి కుటుంబసభ్యులు నిరాకరించారని, దీంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులను అతికించినట్లు మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.

News May 17, 2024

RCB, CSK మధ్య 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే?

image

చిన్నస్వామి స్టేడియంలో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉండటంతో RCB, CSK మ్యాచ్‌‌పై ఆశలు చిగురిస్తున్నాయి. రాత్రి 10 తర్వాత వర్షం తెరిపిచ్చినా కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. అప్పుడు 5 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశముంది. అదే జరిగి బెంగళూరు 5 ఓవర్లలో 80 రన్స్ చేస్తే చెన్నైని 62 పరుగులకే నియంత్రించాలి. ఛేదనలో అయితే మ్యాచ్‌ను 3.1 ఓవర్లలో ముగించాలి. ఇవి రెండూ సాధ్యంకాకపోతే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

News May 17, 2024

సులభతర వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి శ్రీధర్‌బాబు

image

TG: పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సులభతర వాణిజ్య విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి పౌరుడూ లబ్ధి పొందేలా తమ కార్యక్రమాలు ఉంటాయని, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఓ ప్రాపర్టీ షోలో మాట్లాడుతూ.. గ్రీన్ బిల్డింగ్స్ గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని సూచించారు.

News May 17, 2024

చాబహార్ తరహాలో మరిన్ని నిర్మిస్తాం: కేంద్ర మంత్రి

image

ఇరాన్‌లో చాబహార్ పోర్టును నిర్మించి దాని నిర్వహణ బాధ్యతలను భారత్ ఇటీవల దక్కించుకుని దౌత్యపరంగా ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలు మరిన్ని చేపడతామంటున్నారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. విదేశాల్లో ఆర్థికంగా, దౌత్యపరంగా కీలకమైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. కాగా చాబహార్ ద్వారా పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా దేశాలతో భారత్ ట్రేడ్ సులువు కానుంది.

News May 17, 2024

ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలు వివాదంలో ట్విస్ట్

image

ప్లాట్ కొనుగోలు <<13261869>>వివాదంలో<<>> జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు వస్తున్న వార్తలపై ఆయన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రాపర్టీని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని తెలిపింది. ఇక నుంచి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించకుండా ఉండాలని కోరింది.

News May 17, 2024

బౌండరీల దూరాన్ని పెంచండి: కుంబ్లే

image

పొట్టి ఫార్మాట్‌లో 200+ స్కోర్లు ఈజీగా నమోదవుతున్నందున భవిష్యత్తులో కుర్రాళ్లెవరూ బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోరని కుంబ్లే అభిప్రాయపడ్డారు. అందుకే బౌండరీ లైన్ల పరిధిని పెంచాలని, డగౌట్‌ను స్టాండ్స్‌లోకి మార్చాలని ICCకి సూచించారు. ‘గ్రౌండ్ మధ్య నుంచి సమానంగా బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలి. చుట్టూ 77M దూరం ఉండాలి. స్ట్రెయిట్ బౌండరీ 64M ఉండాలి. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకం పాటించాలి’ అని పేర్కొన్నారు.

News May 17, 2024

మోదీ, యోగిపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థరహితం: రాజ్‌నాథ్

image

ప్రధాని మోదీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. జూన్ 1 తర్వాత మళ్లీ జైలుకెళ్లాల్సిన వ్యక్తి మోదీ గురించి అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2029లోనూ ఆయనే ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందని చెప్పారు. యోగిపైనా కేజ్రీ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

News May 17, 2024

భారత్ వృద్ధి అంచనాను పెంచిన యూఎన్

image

ఈ ఏడాది భారత్ వృద్ధిపై గతంలో వేసిన అంచనాను యూఎన్ సవరించింది. గతంలో భారత్ 6.2% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేయగా తాజాగా దానిని 6.9%కు పెంచింది. పబ్లిక్ పెట్టుబడులు, కొనుగోళ్లు పెరగడమే భారత్ వృద్ధికి కారణమని పేర్కొంది. మరోవైపు 2025లో భారత్ వృద్ధిపై అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. వచ్చే ఏడాది వృద్ధి 6.6శాతంగా ఉండనున్నట్లు తెలిపింది.

News May 17, 2024

ఘోరం.. ఆస్తి కోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

image

TG: సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తి కోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ(80) అనారోగ్యంతో చనిపోగా.. ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు రూ.21 లక్షల ఆస్తి, 20 తులాల బంగారం పంచుకోవడానికి పోటీ పడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. ఈ తంతు తేలకపోవడంతో 2 రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహనసంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు.

News May 17, 2024

క్రికెట్‌లో 9 రకాల డక్స్

image

– మొదటి బంతికే ఔటైతే గోల్డెన్ డక్
– రెండో బంతికి ఔటైతే సిల్వర్ డక్
– మూడో బంతికి ఔటైతే బ్రౌంజ్ డక్
– ఒక్క బాల్ ఆడకుండా ఔటైతే డైమండ్ డక్
– బ్యాటర్ ఫస్ట్ బాల్‌కి ఔటవడంతో ఇన్నింగ్స్ పూర్తయితే లాఫింగ్ డక్
– 2 ఇన్నింగ్స్‌లోనూ డకౌట్ అయితే పెయిర్ డక్
– 2 ఇన్నింగ్స్‌లోనూ గోల్డెన్ డక్ అయితే కింగ్ పెయిర్ డక్
– మూడు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయితే బ్యాటింగ్ హ్యాట్రిక్ డక్
– ASHESలో ఫస్ట్ బాల్‌కే ఔటైతే రాయల్ డక్